Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు, అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. దీంతో టీడీపీ శ్రేణులకు కొంత ఉపశమనం లభించట్లైంది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని.. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోరారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
అటు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు తదుపరి వాదనలు వింటామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. అయితే వాదనలకు మరో గంట సమయం కావాలని ఇరువైపు న్యాయవాదులు కోరగా.. అత్యవసర కేసులు విచారణ ఉన్నందున శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. ఆ రోజే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది..
మరోవైపు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు వార్తలు వచ్చాయి. తీవ్ర ఉక్కపోతతో స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో వైద్యధాకారికి చంద్రబాబు సమాచారం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యులు మూడు పూటలా ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout