Chandrababu:చంద్రబాబు అరెస్ట్ : ఆ సామాజిక వర్గం బరితెగింపు , కుల రాజకీయాలకు తెర జగన్ మనిషైతే ‘‘నో ఎంట్రీ’’
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను రాష్ట్ర ప్రజలు ఏమో గానీ ఆయన సామాజిక వర్గం ఏ కోశాన జీర్ణించుకోలేకపోతోంది. 45 ఏళ్ల పొలిటికల్ లైఫ్‌లో ఇప్పటి వరకు చంద్రబాబును ఏవరూ అరెస్ట్ చేయలేకపోయారంటూ ఇప్పటి వరకు ఆ వర్గం గొప్పగా చెప్పుకునేందుకు కానీ జగన్ ట్రాక్ రికార్డును బద్ధలుకొట్టారు. అవినీతి విషయంలో ఎంతటి వారినైనా తాను ఊపేక్షించనని, చట్టం నిలబెడతానని చంద్రబాబు అరెస్ట్ ద్వారా జగన్ చాటి చెప్పారు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో జగన్ తనను టచ్ చేయరని భావించిన చంద్రబాబు బొక్కబోర్లాపడ్డారు.
చంద్రబాబు రిమాండ్‌ను పెంచుకుంటూ వెళ్తున్న కోర్ట్ :
ఒకవేళ తాను జైలుకు వెళ్లినా 24 గంటలు గడిచేలోగా బయటికి వచ్చేస్తానని లెక్కలు కట్టారు. కానీ సీఐడీ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలు, వాదనల ముందు బాబు ఎత్తులు చిత్తయ్యాయి. దాదాపు 16 రోజులుగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. దీనికి తోడు మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్ట్ . ఇది ఆ సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదు. రేపు కాకపోతే ఎల్లుండైనా ఆయన బయటకు వచ్చేస్తాడని భావిస్తుంటే.. అది ఇంకా వెనక్కుపోతూ వుండటంతో బాబు వర్గం నేతల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.
మిగిలిన కులాలను అంటరానివాళ్లుగా చూస్తోన్న ఆ సామాజిక వర్గం :
ఇకపోతే.. చంద్రబాబు కోసం టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లోనూ టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేశారు. అయితే చంద్రబాబు బయటకు రాకపోవడంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మిగిలిన కులాలను, పార్టీలను అంటరానివాళ్లుగా చూస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇది అంతిమంగా సమాజంలో ఘర్షణలకు తావిచ్చేలా వున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్రీ పాయింట్లు, హోటల్ వద్దకు జగన్ సామాజిక వర్గం రావొద్దట :
చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్నవారికి 50శాతం ఫుడ్ సబ్సిడీ ఇస్తున్నట్టుగా సూర్యాపేట వద్ద నున్న లిటిల్ విలేజ్ ప్రకటించింది. ఈ హోటల్‌ను నడుపుతున్న బాబు సామాజిక వర్గానికి చెందిన వి.ఆర్.కన్నెగంటి చంద్రబాబుకు మద్దతుగా , ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీ వ్యతిరేకులపై గతంలో పుంఖానుపుంఖాలుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అలాగే హైదరాబాద్ కేపీహెచ్‌బీ వద్ద రెడ్డి సామాజిక వర్గం, వైసీపీ అభిమానులు తమ కర్రీ పాయింట్ల వద్దకు రావొద్దంటూ కేపీహెచ్‌బీ కర్రీస్ పాయింట్ల సెక్రటరీ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనితో పాటు చంద్రబాబు వ్యతిరేకులు, వైసీపీ కార్యకర్తలు తమ కార్ షోరూంకు రావొద్దంటూ హైదరాబాద్ మాదాపూర్‌లో XENEX షోరూం తన దుకాణం ముందు బ్యానర్ పెట్టిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
సమాజం ఒక్క కులానిదే కాదు :
కానీ చంద్రబాబు వర్గీయులు ఒకటి మరచిపోతున్నారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని రకాల వ్యక్తులు కలిస్తేనే సమాజం. ఒకరితో ఒకరికి అవసరాలు, పనులు ఖచ్చితంగా వుంటాయి. కర్రీ పాయింట్లు, హోటల్స్, ఇతర వ్యాపార సముదాయాలకు రెడ్డి సామాజిక వర్గం, వైసీపీ అభిమానులను రానివ్వకుంటే వారికే నష్టం. ప్రపంచం చాలా పెద్దదన్న విషయం వాళ్లు గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికే కాదు.. ఇతర కులాలకు చెందినవారికి కూడా వ్యాపారాలున్నాయి. వాళ్లంతా ఆ కులాన్ని, టీడీపీ అభిమానులను బహిష్కరిస్తే ఎలా వుంటుందన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments