Telangana TDP Candidates:తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై.. 87 స్థానాల్లో అభ్యర్థులు రెడీ..

  • IndiaGlitz, [Monday,October 16 2023]

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తామని ప్రకటించారు. రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో తాను కలిశానని.. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానని చెప్పారు. రేపు(మంగళవారం) చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని.. ఎన్నికల్లో తప్పకుండా పోటీకి దిగుతామన్నారు. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ తరపున ప్రచారం చేస్తారన్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీతో ముందుకెళ్లాలా? లేదా అనేది త్వరలోనే చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు.

బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం..

తెలంగాణలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో టీడీపీ యువనేత నారా లోకేష్, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అప్పటి నుంచి తెలంగాణలో ఈ మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల జనసేన 37 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు టీడీపీ కూడా 87 స్థానాల్లో పోటీకి సై అంటోంది. విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చూకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి పొత్తులపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ..

ఇక 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు వచ్చాయి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేయడంతో టీడీపీ 2 ఎమ్మెల్యే సీట్లు రాగా.. బీజేపీకి మాత్రం ఘోరంగా ఒకే ఒక్క సీటు వచ్చింది. తర్వాత ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణలో రాజకీయ వ్యవహారాలు తగ్గిపోయాయి. కానీ బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో పార్టీ కార్యక్రమాలు పుంజుకున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. దీంతో ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మరి టీడీపీ సింగిల్‌గా పోటీ చేస్తుందా..? పొత్తులతో కలిసి వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

KCR:కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. జనగామ సభలో ప్రజలకు కేసీఆర్ పిలుపు

ధరణి పోర్టల్‌ను తీసేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

B-Form: బీ-ఫారం అంటే ఏమిటి..? బీ-ఫారం లేకపోతే ఏమౌతుంది..?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫాంలు అందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్

Chandrababu:చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి ఊరట.. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట దక్కింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో

Saindhav:'ఈసారి లెక్క మారుద్ది' అంటున్న వెంకీ మామ.. యాక్షన్ థ్రిల్లర్‌గా 'సైంధవ్' టీజర్‌..

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'సైంధవ్'.

Prithviraj:ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి పృథ్వీరాజ్ కొత్త పోస్టర్ విడుదల..

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మూవీల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో