ఇండిపెండెట్ను ఓడించలేకపోయిన టీడీపీ, బీజేపీ!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డ్ బ్రేక్ చేశారు. కాగా రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఇండిపెండెండ్ అభ్యర్థి సుమన్ నిలవగా.. టీడీపీ, బీజేపీలకు డిపాజిట్లు దక్కలేదు. అంటే తెలంగాణలో ఈ రెండు పార్టీల పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కంచుకోట బద్ధలై.. రికార్డ్ బ్రేక్ అయ్యింది!
వాస్తవానికి హుజూర్నగర్ కాంగ్రెస్ కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ టీఆర్ఎస్ ఖాతా తెరవలేదిక్కడ. ఇప్పటి వరకూ పలుమార్లు పోటీ చేసినప్పటికీ గులాబీ జెండా గుబాలించలేదు. అయితే ఫస్ట్ టైమ్ ఎవరి ఊహకందని రీతిలో ఇదివరకున్న రికార్డులన్నీ బ్రేక్ చేసిన సైదిరెడ్డి బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదేమో.
చేజేతులారా పరువు తీసుకున్న బాబు!
అయితే ఇక్కడ బీజేపీ, టీడీపీ పార్టీల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ సైకిల్‌కు పంచర్లు వేసుకోలేనంతగా రిపేర్‌కు వచ్చింది. బహుశా ఇకపై రిపేర్‌కు కూడా నోచుకోదేమో కానీ.. దీన్ని ఎంతమంది మెకానిక్‌లు ఇప్పట్లో వర్కవుట్ అవ్వడం అసాధ్యం.. అది జరగని పని.. ఎందుకు ఏమీ అనే విషయాలు ప్రత్యేకించి వివరించాల్సిన అవసరంలేదు. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు గండం అనుకుంటే టీడీపీ అధినేత ఏకంగా అభ్యర్థిని ప్రకటించి వచ్చిన ఓట్లు చూసి కంగుతిన్నారట. అంటే చేజేతులారా పరువు తీసుకోవడమేనని విశ్లేషకులు.. అధికార పార్టీలు ఇప్పటికే సెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి.
బీజేపీ పరిస్థితి మరీ ఘోరం!
ఇక బీజేపీ విషయానికొస్తే.. అదేదో ఒక డైలాగ్ ఉంటుందే.. మాటలెక్కువ చేతలు తక్కువ అన్నట్లుగా.. బీజేపీ నేతలు ఓట్లు సంపాదించుకోలేరు కానీ.. మాటలెక్కువే అవి కూడా కోటలు దాటుకుని పోయేంత.. ఇదీ తెలంగాణలో బీజేపీ పరిస్థితని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీ చేయడం తప్పులేదు కానీ మొదట పునాదులు ఉండాలి కదా.. అవేం లేకుండానే అదేదో ఇళ్లు అలకగానే పండుగ అయిపోయినట్లు హడావుడి చేయడం వల్ల ప్రయోజనమేంటి..? చివరకి హుజుర్నగర్లో వచ్చిన ఫలితాల్లాగా ఉంటుంది మరి.
బెటర్ లక్ నెక్స్ట్ టైమ్!
ఇదిలా ఉంటే.. హుజుర్నగర్లో బీజేపీ, టీడీపీలు రెండూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి సాధించినన్ని ఓట్లు దక్కించుకోలేకపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ప్రయత్నం మంచిదే.. కానీ దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది ముఖ్యం.. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని విశ్లేషకులు చెబుతున్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments