TDP-BJP-JSP: తేలిన పొత్తు లెక్క.. పోటీ చేసే స్థానాలు ప్రకటించిన టీడీపీ-బీజేపీ-జనసేన..

  • IndiaGlitz, [Tuesday,March 12 2024]

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై కూడా క్లారిటీ వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం జరిగింది. మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహాలపై సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా, జనసేనాని పవన్ కల్యాణ్‌, చంద్రబాబు పాల్గొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుండగా.. జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పొత్తు ధర్మం పాటిస్తూ తనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాలు బీజేపీకి కేటాయించగా.. టీడీపీ ఓ స్థానాన్ని వదులకుంది. దీంతో మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లు కమలనాథుల ఖాతాలో పడ్డాయి. ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, విశాఖ నార్త్, బద్వేల్, కైకలూరు, పాడేరు వంటి స్థానాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఎంపీ స్థానాలకు వస్తే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థులు.. మిగిలిన నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రజల స్థితి గతులు మెరుగు పరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని, ఎన్డీఏ భాగస్వాములుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపాయి. తమ కూటమిని ఆశీర్వదించాలని ప్రజలను కోరాయి. కాగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మూడు రోజుల పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ పెద్దలు అధికారికంగా ప్రకటించారు.

More News

Jayalalitha: శరత్‌బాబుతో పిల్లలు కనాలనుకున్నా.. జయలలిత హాట్ కామెంట్స్..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, నటిగా ఓ వెలుగు వెలిగారు జయలలిత. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చూస్తున్నారు.

పచ్చ ముఠా వేధింపులకు బలైన యువతి.. ఆత్మహత్యలకు పురిగొలుపుతున్న పెత్తందార్లు..?

సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో పేదలకు మంచి జరిగినా... తమకు ప్రయోజనం కలిగిందని చెప్పినా.. అటు పెత్తందారులు...

హీరోయిన్ పెళ్లి చేసుకుని మోసం చేసింది.. భర్త సంచలన ఆరోపణలు..

ఆమె తెలుగు సీరియల్స్‌లో నటిస్తోంది. మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ యువకుడిని చూసి ఇష్టపడింది. తర్వాత అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు.

CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎప్పుడంటే..?

ఈ మధ్య తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. తాజాగతా మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు అయ్యేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్.