'టాక్సీవాలా' రాక అప్పుడేనా?

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జంటగా నటించిన మూవీ ‘టాక్సీవాలా’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జిఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఓ కీలక పాత్రలో నటించారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో పాటు రెండు వారాల క్రితం విడుదలైన టీజ‌ర్ కూడా ఈ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకుని వెళ్ళింది.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్టు సమాచారం. నిర్మాణానంతర పనులలో భాగంగా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఈ చిత్రాన్ని ముందు అనుకున్నట్టుగా ఈ నెల 18న కాకుండా.. జూన్ 14న విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌స్తుంది.

More News

పూరి మ‌న‌సు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంద‌నేది 'మెహ‌బూబా' సినిమా చూస్తే తెలుస్తుంది - దిల్‌రాజు

పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'.

మే11 నుంచి హైద్రాబాద్ లో 'పడి పడి లేచే మనసు' తాజా షెడ్యూల్

యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "పడి పడి లేచే మనసు".

హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' మొదటి పాట విడుదల

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా

సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి

ఈ భూమికి ఒకే ఒక ఆకాశం అలాగే చలన చిత్ర పరిశ్రమకి ఒకే ఒక సావిత్రి.సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి.

మే 11న 'స‌మ్మోహ‌నం'తొలి గీతం ఆవిష్క‌ర‌ణ‌

సినిమా, సాహిత్యం ఎప్పటికీ బ‌తికే ఉంటాయి అనే ఆస‌క్తిక‌ర‌మైన డైలాగుతో ఇటీవ‌ల విడుద‌లయిన `స‌మ్మోహ‌నం`