అఖిల్‌తో టాక్సీవాలా హీరోయిన్‌?

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

తొలి చిత్రం టాక్సీవాలా అనుహ్య విజ‌యంతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే.. హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్‌కు కూడా చాలా మంచి పేరే వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత ప్రియాంక‌కు ర‌వితేజ హీరోగా వి.ఎ.ఆనంద్ తెర‌కెక్కిస్తోన్న 'డిస్కోరాజా'లో నటించే అవ‌కాశం ద‌క్కింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం గీతాఆర్ట్స్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఆ చిత్రంలో న‌టించడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్రియాంక జ‌వాల్క‌ర్‌ను క‌లుసుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై అఖిల్ కానీ.. నిర్మాణ సంస్థ కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఒక‌వేళ నిజ‌మైతే మాత్రం ప్రియాంకు గోల్డెన్ ఆఫ‌ర్ అనే చెప్పాలి.