మార్చిలో 'టాక్సీవాలా'

  • IndiaGlitz, [Monday,January 22 2018]

సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అత‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ అర‌డ‌జ‌ను చిత్రాల‌తో బిజీగా ఉన్నా.. వీటిలో 'టాక్సీవాలా' ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కొత్త ఏడాది సంద‌ర్భంగా విరామం తీసుకున్న విజ‌య్‌.. ఇప్పుడు మళ్ళీ 'టాక్సీవాలా' షూటింగ్ కి హాజరయ్యారు. 'అర్జున్ రెడ్డి' తర్వాత విడుదల కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిర్మాణానంతర పనుల్లో భాగంగా గ్రాఫిక్స్ తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి పనులని కూడా పూర్తి చేసుకుని ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు విజయ్ వెల్లడించారు. అలాగే కొత్త దర్శకులతో పని చేస్తుంటే వారి ఆలోచనలు, వారి పనితనం కూడా చాలా కొత్తగా ఉంటుందని.. తెరపై ఆ ఫ్రెష్ నెస్ అన్నది కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు విజయ్.

ఆ కొత్త ఆలోచనలతోనే డెబ్యు డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' అంత పెద్ద సంచలన విజయం సాధించిందని....ఇప్పుడు 'టాక్సీవాలా' సినిమాతో రాహుల్ సాంకృత్యాయన్ కూడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులకి నచ్చే విధంగా డైరెక్టర్ తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. అలాగే ఇక ఈ రెండు సినిమాలలో తను నటించిన పాత్రలకి చాలా వ్యత్యాసం ఉందని కూడా తెలిపారు విజయ్.

More News

మళ్ళీ బాలయ్య తోనే..

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు..సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.

వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

‘శివ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున,దర్శకుడు రాంగోపాల్ వర్మ.

చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి  డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.