లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న డిఫరెంట్ మూవీ శంకర - డైరెక్టర్ తాతినేని సత్య

  • IndiaGlitz, [Wednesday,October 19 2016]

నారా రోహిత్ - రెజీనా జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌ర‌. ఈ చిత్రాన్ని భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌ప్ర‌కాష్ తెర‌కెక్కించారు. సాయిలీల మూవీస్ బ్యాన‌ర్ పై ఆర్.వి. చంద్ర‌మౌళి ప్ర‌సాద్, ఎం.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 21న శంక‌ర ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య మాట్లాడుతూ... నారా రోహిత్ నేచుర‌ల్ ఏక్టింగ్, రెజీనా గ్లామ‌ర్ ఈ చిత్రానికి ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన మౌన‌గురు చిత్రానికి రీమేక్ గా శంక‌ర్ రూపొందింది.
మౌన‌గురు చిత్రాన్నే హిందీలో సొనాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌లో ఎ.ఆర్.మురుగుదాస్ అకిరా టైటిల్ తో రూపొందించారు. సాయికార్తీక్ నాలుగు పాట‌ల‌కు అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా లేట్ అయినా లేటెస్ట్ గా వ‌స్తుంది. ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది అనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత నాకు చాలా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తాయి అని ఆశిస్తున్నాను. శంక‌ర్ షూటింగ్ లేట్ అవ్వ‌డం వ‌ల‌న ఈ గ్యాప్ లో స‌చిన్ జోషితో వీడు ఎవ‌డు అనే సినిమా చేసాను. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

More News

నేను ఎవరి కోసం ఎదురు చూడను - పూరి జగన్నాథ్..

కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే పూరి...!హీరోలను సరికొత్తగా చూపించే డైరెక్టర్ అంటే పూరి..!తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసే స్పీడు డైరెక్టర్ అంటే పూరి..!

36 ఇండ్యూజువల్ క్యారెక్టర్స్ తో 'చల్ చల్ గుర్రం'

సాధారణంగా సినిమాల్లోని పాత్రల మధ్య రిలేషన్స్ ఉంటాయి. కానీ చల్ చల్ గుర్రం సినిమాలో పాత్రల మధ్య రిలేషన్స్ ఉండవు. అలా రిలేషన్ లేని 36 పాత్రల మధ్య నడిచే కథే `చల్ చల్ గుర్రం` అని అన్నారు దర్శకుడు మోహన ప్రసాద్.

ప్రేమ‌మ్ సినిమా తీయ‌డానికి గ‌ట్స్ కావాలి.. చైత‌న్య అద్భుతంగా న‌టించాడు - నాగార్జున

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మించారు.

ఓం నమో వెంకటేశాయ రిలీజ్ గురించి ఎక్స్ క్లూజీవ్ న్యూస్..!

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

'కేశవ' గా వస్తున్న నిఖిల్

'స్వామి రారా'..విడుదలైనప్పుడు చిన్న సినిమానే.మాకు ఇటువంటి సినిమాలే కావాలంటూ ప్రేక్షకులు పెద్ద సినిమా చేసి భారీ విజయం అందించారు.