Bigg Boss Telugu 7 : టేస్టీ తేజా ఎలిమినేషన్ .. నువ్వు లేకుండా వుండలేనంటూ శోభా కంటతడి, నాగ్ సైతం ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో వరుసగా అమ్మాయిలే ఎలిమినేషన్ అవుతున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకున్న నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. గత వారం సందీప్ మాస్టర్‌ను ఇంటికి పంపేసిన బిగ్‌బాస్.. ఈ వారం కూడా మరో మేల్ కంటెస్టెంట్‌ను బయటకు పంపారు. అది కూడా హౌస్‌లో అందరూ ఎంతో ఇష్టపడే వ్యక్తిని .. తన టైమింగ్‌తో ఆడియన్స్‌కు నవ్వులు పూయించిన వ్యక్తిని. అతను ఎవరో కాదు.. టేస్టీ తేజ. శనివారం నాడు హౌస్‌మేట్స్ పర్ఫార్మెన్స్‌పై రివ్యూ ఇచ్చిన నాగార్జున ఎవ్వరినీ సేవ్ చేయలేదు. ఆదివారం ఈ ప్రక్రియ మొదలుపెట్టాడు.
ఈ వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్, రతిక, శోభా, ప్రియాంక, అర్జున్, తేజ, భోలే షావళి, ప్రిన్స్ యావర్ వున్నారు. ఒక్కొక్కరు సేవ్ అవుతూ రాగా.. చివరికి రతిక, తేజ మిగిలారు. అయితే హౌస్‌లో అందరికంటే తనకే తక్కువ ఓట్లు వచ్చాయని.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది తానేనని భయపడిన రతిక కన్నీటి పర్యంతమైంది. తనకు ఒక్క వారం ఛాన్స్ ఇవ్వాలని.. ఎలిమినేట్ చేయొద్దని నాగార్జునను వేడుకుంది. తన చేతుల్లో ఏం లేదని.. ఓటింగ్ ముగిసిందని నాగ్ క్లారిటీగా చెప్పాడు. రతిక, తేజలను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున .. ఎవరి పేరు బోర్డుపై కనిపిస్తుందో వారు ఎలిమినేట్ అవుతారని వెల్లడించాడు. ఇంతలో బోర్డుపై తేజ పేరు రావడంతో అతను ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. ఈ పరిణామంతో రతికకు ప్రాణం లేచొచ్చినట్లయ్యింది.
తేజకు వీడ్కోలు చెబుతూ శివాజీతో పాటు హౌస్‌మేట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరిని చూసి ఏడవొద్దు అనుకున్నా.. ఏడ్చేశాడు.. హౌస్‌లో తాను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే తనను క్షమించాలని చెప్పాడు. స్టేజ్‌పై నాగ్‌తో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అమ్మను తీసుకొద్దామనుకున్నానని అదొక్కటే లోటు అని ఎమోషనల్ అయ్యాడు. తర్వాత నాగార్జున సైతం .. అందరినీ ఎంత నవ్వించావ్, నేను కూడా మిస్ అవుతానని ఎమోషనల్ అయ్యాడు. చివరిలో శివాజీ మాట్లాడుతూ.. నువ్వు చాలా తెలివైనవాడివని, నేను చూసినవాళ్లలో నువ్వు చాలా అరుదైన వాడివని అన్నాడు.
తేజ వెళ్లిపోతుంటే అతని ఫ్రెండ్ శోభ అందరికంటే ఎక్కువగా ఫీలైంది. నువ్వు లేకుండా మిగిలిన రోజులు ఎలా వుండాలో.. అది తలచుకుంటేనే భయం వేస్తోంది అంటే కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత హౌస్‌మెట్స్‌కు మార్కులు వేయాలని నాగ్ తేజకు టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా శోభకు 10కి 20 మార్కులు వేసిన తేజ.. ఇన్ని వారాలు తనను భరించినందుకు అన్ని మార్క్స్ ఇచ్చానని చెప్పాడు. గౌతమ్‌కు 8, అర్జున్‌కు 8, ప్రిన్స్ యావర్‌కు 10, భోలేకు 7, అశ్వినీకి 8, ప్రశాంత్‌కు 9, ప్రియాంకకు 10, అమర్‌దీప్‌కు 9, రతికా 8, శివాజీకి 8 మార్కులు వేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు.
అంతకుముందు సండే ఫండే కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్‌తో ఆటలు ఆడించాడు. ‘‘జిగర్తాండ’’ మూవీ టీమ్ స్టేజ్‌పై సందడి చేసింది. తొలుత రాఘవ లారెన్స్, అనంతరం ఎస్‌జే సూర్య వచ్చి తమ కొత్త సినిమాల సంగతులను పంచుకున్నారు. అనంతరం హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చి మహిళలు అనారోగ్యాలు, వారి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన కల్పించింది. తర్వాత నాగార్జున.. కొన్ని సామెతలను ఇచ్చి అది ఇంటి సభ్యుల్లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని ఆదేశించాడు. ఈ గేమ్ నవ్వులు పూయించింది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments