'తరువాత ఎవరు' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Thursday,July 19 2018]

మనోజ్, ప్రియాంక శర్మ జంటగా కమల్ కమరాజు ముఖ్యపాత్రలో హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ బ్యానర్ పై జి కృష్ణప్రసాద్ అండ్ కె రాజేష్ దర్శకత్వం లో లక్ష్మీ రెడ్డి కె,రాజేష్ కోడూరు సంయుక్తంగా నిర్మించిన రియాలిటీ హార్రర్ బేస్డ్ థ్రిల్లర్ చిత్రం 'తరువాత ఎవరు'.

విజయ్ కూరకుల సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ జులై 18న ప్రసాద్ లాబ్ లో ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమoలో నా లవ్ స్టొరీ హీరో మహీధర్,ప్రముఖ దర్శకుడు శివరామకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

తరువాత ఎవరు ట్రైలర్ ని బాక్సఆఫీస్ చందు రమేష్ రిలీస్ చేయగా,,ఆడియో సీడీలని ప్రముఖ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లాంచ్ చేశారు.లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.ఆగస్ట్ 3న ఈ చిత్రాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మాట్లాడుతూ- ట్రయిలర్ చాలా డిఫ్రెంట్ గా ఉంది.హార్రర్ బేస్డ్ థ్రిల్లర్స్ చిత్రాలు చాలా వచ్చాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా మంచి హిట్ అయి యూనిట్ అందరికి మంచి పేరు డబ్భులు రావాలి అన్నారు.

చిత్ర దర్శకుడు జి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ- ఇది ఒక రియాలిటీ బేస్డ్ థ్రిల్లర్ మూవీ.ఒక నలుగురు కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగే స్టోరీ.ఆడియెన్స్ అందరికి ఈ చిత్రం నచ్చుతుంది.మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు వారికి నా థాంక్స్ అన్నారు.

మరో దర్శకుడు కె రాజేష్ మాట్లాడుతూ- నేను నా మిత్రుడు కృష్ణ ప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చాలా బాగా వచ్చింది.ఆగస్టులో ఈ చిత్రన్ని రిలీజ్ చేస్తాం అన్నారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ- ఇది నా ఫస్ట్ ఫిల్మ్. నా మీద నమ్మకంతో ఈ సినిమా చేసిన మా దర్శకులకు,నిర్మాతకు నా థాంక్స్.ట్రైలర్ కి సుపెర్బ్ రెస్పాన్స్ వచ్చింది.మూవీ కూడా అందరికీ నచ్చుతుంది అన్నారు.

నా లవ్ స్టొరీ ఫేమ్ మహీధర్ మాట్లాడుతూ- సాంగ్స్,,ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి.ఈ సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు తేవాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ- ఈ చిత్రం లో ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. ఫస్ట్ సినిమా అయినా కూడా నిర్మాతలు, దర్శకులు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.టీమ్ అంతా చాలా కష్టపడి వర్క్ చేశారు.డెఫినెట్ గా ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది అన్నారు.

ఎడిటర్ వెంకటేష్ మాట్లాడుతూ- అందరం కష్టపడి ఒక మంచి సినిమా చేసాం.అందరి సపోర్ట్ మాకు కావాలి.ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్3న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

రచయిత; చిట్టి శర్మ, కెమెరా: రాజేంద్ర కేసాని, ఎడిటర్: ఎ. వెంకటేష్, సంగీతం: విజయ్ కురాకుల, పాటలు: కరుణాకర్, నిర్మాతలు: కె లక్ష్మీ రెడ్డి,రాజేష్ కోడూరు.దర్శకత్వం: జి కృష్ణప్రసాద్ అండ్ కె రాజేష్.

More News

'గూఢచారి' తో సుప్రియా యార్లగడ్డ రీఎంట్రీ

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు 'గూఢచారి'తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు.

రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లో కాకుండా కంటెంట్ బేస్డ్‌గా రూపొందిన చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌'

'ప‌వ‌ర్‌', 'లింగా', 'బ‌జ‌రంగీ భాయీజాన్‌' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌'.

జులై 27న 'మిష‌న్ ఇంపాజిబుల్ - ఫాలౌట్‌'

మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్‌కున్న ప్ర‌త్యేక‌త ఏంటంటే ప్ర‌తి సినిమాకూ ద‌ర్శ‌కుడు మారుతూ ఉండ‌ట‌మే. ఈ వ‌రుస‌లో ఒక్కో సినిమాకు, ఒక్కో ద‌ర్శ‌కుడు ప‌నిచేయ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

త్వ‌రలో సినిమా హీరోగా దిల్‌రాజు వార‌సుడు...

వార‌స‌త్వ హీరోలు తెలుగు సినిమాల‌కు కొత్తేం కాదు.. హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు ఇలా అంద‌రూ కొడుకులు హీరోలుగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నవారే.

టాలీవుడ్‌లోకి మ‌రో బాలీవుడ్ న‌టి...

తెలుగు సినిమా రేంజ్ నేడు బాలీవుడ్ సినిమాల‌ను చేరింది. ఇక్క‌డ క్వాలిటీ సినిమాలు రూపొందుతున్నాయి. అందుక‌నే బాలీవుడ్ న‌టీన‌టులు కూడా ద‌క్షిణాదిన‌..