అదే కథతో తరుణ్ వెబ్ సిరీస్...
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `పెళ్ళిచూపులు`తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు.. నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. తదుపరి కుర్రాళ్లతో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. సినిమా కమర్షియల్‌గా లాభాలను తెచ్చి పెట్టినా.. తరుణ్ భాస్కర్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదు.
ఇప్పుడు మరో కథను సిద్ధం చేస్తున్నాడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌ను కూడా తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఈ నగరానికి ఏమైంది స్టోరీ లైన్‌లోనే ఉంటుందట. ఈ సినిమా కథను వెబ్‌సిరీస్‌గా రూపొందించడానికి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోనే పోల్ నిర్వహించాడట తరుణ్ భాస్కర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments