వారిని టార్గెట్ చేసుకున్న తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు యువ కథానాయకుడు తరుణ్. త్వరలో ఇది నా లవ్ స్టోరి` అంటూ సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కోసం తనే స్వయంగా రంగంలోకి దిగారు తరుణ్. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న తరుణ్..
ఇప్పుడు తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే యూత్‌ని, కాలేజ్ అమ్మాయిలని తిరిగి ఎట్రాక్ట్ చేయడమే టార్గెట్‌గా ఈ ప్రమోషన్స్ చేయబోతున్నారట. ఈ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాలని...పూర్వ వైభవం సంపాదించుకోవాలని తరుణ్ మంచి పట్టుదలతో ఉన్నారు. తరుణ్ సరసన ఓవియా కథానాయికగా నటించిన ఈ సినిమా ద్వారా రమేష్ గోపి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments