తరుణ్ తాజా విశేషాలు
Send us your feedback to audioarticles@vaarta.com
'పెళ్లిచూపులు' సినిమా పేరు చెప్పగానే అందులో హీరో విజయ్ దేవరకొండ పేరు ఎంత మందికి గుర్తుకొస్తుందో, ఆ చిత్ర దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పేరు అంతే మందికి గుర్తొస్తుంది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ తెచ్చుకున్న పేరు అలాంటిది మరి. ఒక సినిమాకు రెండు జాతీయ అవార్డులను చాన్నాళ్ల తర్వాత తెచ్చిపెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తన తాజా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.
ఈ సినిమాలో 'వెళ్లిపోమాకే' ఫేమ్ విశ్వక్ సేన్ ఓ హీరోగా నటిస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే సినిమాగా ఈ తాజా చిత్రాన్ని తరుణ్ తెరకెక్కిస్తున్నారు. మరో స్నేహితుడి పాత్రకు కొత్త వ్యక్తిని తీసుకున్నారు. ఒక నాయికగా అనీషా ఆంబ్రోస్‌ను నిర్ణయించారు. 45 రోజుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనే సన్నాహాల్లో ఉన్నారు తరుణ్.
సో ఈ సినిమా కూడా కొందరు యంగ్ టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నదన్న మాట. మరో విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో తరుణ్ తల్లి గీతా భాస్కర్ కనిపించనున్నారు. ఆమె `ఫిదా` చిత్రంలో సాయిపల్లవికి అత్తగా నటించిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com