బజ్: అల్లు అర్జున్ 'పుష్ప' కోసం తరుణ్ ?

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిలిం ఇది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

తన ప్రతి చిత్రాన్ని విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సుకుమార్.. ఈ చిత్రంలో ఎర్రచందనం నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో బన్నీ రఫ్ లుక్ లో భీకరంగా కనిపిస్తున్నాడు. హీరో అంత భీకరంగా ఉన్నప్పుడు విలన్ పాత్ర అంతకు మించేలా ఉండాలి.

ఇదీ చదవండి: వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..

పుష్పలో విలన్ గా మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. ఫహద్ ఫాసిల్ కు లవర్ బాయ్ హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫహద్ నటించిన అథిరన్ చిత్రం తెలుగులో అనుకోని అతిథిగా డబ్ అయింది. ఇటీవలే ఓటిటిలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఫహద్ కు హీరో తరుణ్ డబ్ చెప్పాడు.

తరుణ్ వాయిస్ ఫహద్ కు బాగా సెట్ అయిందంటూ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీనితో పుష్ప లో కూడా ఫహద్ పాత్రకు తరుణ్ చేత డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటుంది అని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఫహద్ చేస్తున్నది విలన్ రోల్. విలన్ రోల్ కు గంభీరమైన, క్రూయాలిటీ తో కూడుకున్న వాయిస్ అవసరం. ఈ అంశంలో తరుణ్ వాయిస్ సెట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తక మానదు. మరి సుకుమార్ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారో చూడాలి.

More News

ధనుష్ 'జగమే తందిరం' ట్రైలర్.. శంకర్ దాదా లాగా లండన్ దాదా!

తమిళ హీరో ధనుష్ విజయపరంపర కొనసాగుతోంది. అతడి సినిమాలు తమిళం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ధనుష్ ఎంచుకుంటున్న కథలే.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్

వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..

ఎనెర్జిటిక్ హీరో రామ్ పోతినేని మాస్ చిత్రాలతో అలరిస్తూనే కొత్తదనం ఉన్న కథలకూ ప్రాధాన్యత ఇస్తాడు. రామ్ ప్రతి చిత్రంలో తన లుక్ విషయంలో కేర్ తీసుకుంటాడు.

హైదరాబాద్‌కు స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ 30 లక్షల డోసులు

రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్‌ కంటైనర్లు వచ్చాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు

కేటీఆర్ రియల్ హీరో.. సోనూసూద్ సూపర్ హీరో!

రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ముచ్చటించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.