బజ్: అల్లు అర్జున్ 'పుష్ప' కోసం తరుణ్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిలిం ఇది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
తన ప్రతి చిత్రాన్ని విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సుకుమార్.. ఈ చిత్రంలో ఎర్రచందనం నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో బన్నీ రఫ్ లుక్ లో భీకరంగా కనిపిస్తున్నాడు. హీరో అంత భీకరంగా ఉన్నప్పుడు విలన్ పాత్ర అంతకు మించేలా ఉండాలి.
ఇదీ చదవండి: వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..
పుష్పలో విలన్ గా మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. ఫహద్ ఫాసిల్ కు లవర్ బాయ్ హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫహద్ నటించిన అథిరన్ చిత్రం తెలుగులో అనుకోని అతిథిగా డబ్ అయింది. ఇటీవలే ఓటిటిలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఫహద్ కు హీరో తరుణ్ డబ్ చెప్పాడు.
తరుణ్ వాయిస్ ఫహద్ కు బాగా సెట్ అయిందంటూ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీనితో పుష్ప లో కూడా ఫహద్ పాత్రకు తరుణ్ చేత డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటుంది అని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఫహద్ చేస్తున్నది విలన్ రోల్. విలన్ రోల్ కు గంభీరమైన, క్రూయాలిటీ తో కూడుకున్న వాయిస్ అవసరం. ఈ అంశంలో తరుణ్ వాయిస్ సెట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తక మానదు. మరి సుకుమార్ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com