తరుణ్ భాస్కర్ రెండో సినిమా పూర్తయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
'పెళ్ళి చూపులు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. మంచి విజయం సాధించడమే కాకుండా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రంగా 'ఈ నగరానికి ఏమైంది' ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. 'పెళ్ళి చూపులు' ఫేమ్ వివేక్ సాగర్ ఈ చిత్రానికి కూడా సంగీతమందించారు.
రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులు నటించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. నిర్మాణానంతర పనులు జరుపుకోనున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
తొలి చిత్రంతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. మలి చిత్రంతో విజయాన్ని, పురస్కారాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments