ట్రోలర్స్‌కు తరుణ్ భాస్కర్ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువగా భావ ప్రకటనల వేదికగా మారింది. అయితే ఇదే వేదిక సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారింది. సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. వేరే హీరోలను అభిమానించేవారు మరో హీరోను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం ఎక్కువైంది. ఇలాంటి ట్రోలర్స్‌కు కొందరు గట్టిగా రిప్లై చెబితే కొందరేమో కామ్‌గా ఉంటారు. అలా గట్టిగా రిప్లై చెప్పే వాళ్ల లిస్టులో చేరాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.
రీసెంట్గా ‘కప్పేళ’ సినిమా చూసిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాలో మాటమాటకీ హీరో ఇంట్రడక్షన్ లేదు, సైనికులను ఉద్దేశించి హీరో స్పీచ్‌లు ఇవ్వడాలు లేవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్నీ చూసిన ఓ హీరో అభిమానులు కొందరు మా హీరోనంటావా అంటూ తరుణ్‌పై మాటల దాడి చేశారు. వీరిలో కొందరు హద్దులు దాటారు. వారితో తరుణ్ భాస్కర్ మాట్లాడినప్పుడు వారు దూషించడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే ఇలా ట్రోల్ చేయడమే కాకుండా దూషించి, బెదిరించిన వారిపై తరుణ్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపై ఎవరైనా హద్దులు దాటితే తాను కాకుండా వారికి పోలీసులతో సమాధానం చెప్పిస్తానని అంటున్నారు తరుణ్ భాస్కర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com