Rajyasabha Elections: టార్గెట్ రాజ్యసభ ఎన్నికలు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధం..

  • IndiaGlitz, [Wednesday,January 24 2024]

రాజ్యసభ ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్‌ నెలతో ముగియనుంది. ఈ మూడు స్థానాల్లో ఒకటి వైసీపీ సిట్టింగ్ కాగా.. మిగిలిన రెండు టీడీపీ స్థానాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యా బలం పరంగా మూడు స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది.

దీంతో వైసీపీ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాస్‌లను ఖరారుచేసింది. అయితే ప్రస్తుతం చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగా అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. వైసీపీ నుంచి టీడీపీకి మారిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి.. టీడీపీ నుంచి వైసీపీకి మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి, జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్‌లకు స్పీకర్ నోటీసులు పంపారు.

పార్టీ మార్పుపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో వారిపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత స్పీకర్ ఆమోదించడం విశేషం.

మొత్తానికి గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాటులను రాజ్యసభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా వైసీపీ కసరత్తు చేస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతోంది.

More News

నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వారసుడు వచ్చేస్తున్నాడు...

దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుటుంబాల నుంచి కొంతమంది వారసులు కూడా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు.

Radha vs Uma: విజయవాడ టీడీపీలో సోషల్ మీడియా వార్.. రాధా వర్సెస్ ఉమా..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కీలకమైన విజయవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా(

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం..

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాంటూ పిటిషన్ వేసింది.

జనసేనలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎంపీ.. ముహుర్తం ఖరారు..

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

సీఎం రేవంత్‎ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశామని