చరణ్ టార్గెట్ 102
- IndiaGlitz, [Wednesday,October 14 2015]
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా టాలీవుడ్‌కి పరిచయమైన రామ్‌చరణ్ తన తొలి చిత్రం 'చిరుత'తో ఆకట్టుకున్నాడు. రెండవ చిత్రం 'మగధీర', 'రచ్చ', 'నాయక్', 'గోవిందుగు అందరివాడేలే' చిత్రాలన్నీ 40 కోట్ల మార్కును దాటాయి. అందులో 'మగధీర' 50 కోట్లను దాటింది. అలా చరణ్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు చరణ్ ఏకంగా వందకోట్ల కలెక్షన్స్‌పై కన్నేశాడని ఫిలింవర్గాల సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే ఈ ఏడాది విడుదలైన 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాలు 100కోట్ల షేర్‌ను సాధించాయి. 'బాహుబలి'ని కలెక్షన్స్‌ను దాటడం అంత సులభం కాదు కనుక చరణ్ నెక్ట్స్ టార్గెట్ 'శ్రీమంతుడు' చిత్రమేననాలి. శ్రీమంతుడు మొత్తం రన్‌పై 102కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పుడు చరణ్ తన 'బ్రూస్‌లీ ద ఫైటర్'తో ఆ 102 కోట్ల కలెక్షన్స్‌ను దాటాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ పరిస్థితి, థియేటర్స్ సంఖ్య అన్నీ చూస్తుంటే ఇది నిజమేననే భావన కూడా కలుగుతుంది.
మరోవైపు చరణ్ ఈ సారి 'శ్రీమంతుడు' కలెక్షన్స్‌ను సులువుగా దాటేస్తాడని, అందులో ఏమాత్రం సందేహం లేదని, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో గెస్ట్ రోల్ చేయడం సినిమాకు బాగా కలిసి వచ్చిందనేది ఫ్యాన్స్ వాదన. సినిమా పాజిటివ్ టాక్ రాబట్టుకుంటే చరణ్ 'శ్రీమంతుడు' కలెక్షన్స్‌ను సులభంగా దాటేస్తాడు. అలాగే ఓవర్‌సీస్‌లో కూడా చరణ్ చిత్రమేది వన్ మిలియన్ కలెక్షన్స్‌ను సాధించలేదు. ఆ రికార్డు కూడా 'బ్రూస్‌లీ ద ఫైటర్'తో చరణ్ తన ఖాతాలో వేసుకుంటాడని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.