Alekhya Reddy: రాజకీయాల్లో బాలయ్యకు తారకరత్న భార్య అలేఖ్య మద్దతు
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి తారకరత్న చనిపోయి ఏడాది దాటినా భార్య అలేఖ్య మాత్రం నిత్యం ఆయనను తలుచుకుంటూ ఎమోషన్ అవుతూ ఉంటారు. తారకరత్న అకాలమరణం తర్వాత ఆయన కుటుంబ బాధ్యతను బాలకృష్ణ తీసుకున్న విషయం విధితమే. పిల్లల బాగోగులు చూసుకుంటూ, వారిని అప్పుడప్పుడు కలుస్తూ నేనున్నాంటూ భరోసా ఇస్తూ ఉంటారు. ఇటీవల బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి తారకరత్న కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ ఫోటోలను తాజాగా తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా "నేను ఏ వైపు ఉన్నానని నన్ను ఎప్పుడూ అడుగుతూ వస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే.. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు మరియు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము" రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు బాలయ్యని ప్రశంసలతో అభినందిస్తున్నారు. బాబాయ్‌గా పెద్దరికం బాధ్యతలను నెరవేరుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా అలేఖ్య ఈ పోస్ట్ పెట్టడం విశేషం. అంటే రాజకీయాల్లో తన మద్దతు బాలకృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీకి అని ఆమె పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అలేఖ్యకు సమీప బంధువు అని సంగతి తెలిసిందే. కానీ ఆమె మాత్రం టీడీపీకే తన మద్దతు తెలియజేశారు. తారకరత్న మరణించే ముందు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటుకు గురై అకాలమరణం చెందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com