Alekhya Reddy: రాజకీయాల్లో బాలయ్యకు తారకరత్న భార్య అలేఖ్య మద్దతు

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

నందమూరి తారకరత్న చనిపోయి ఏడాది దాటినా భార్య అలేఖ్య మాత్రం నిత్యం ఆయనను తలుచుకుంటూ ఎమోషన్ అవుతూ ఉంటారు. తారకరత్న అకాలమరణం తర్వాత ఆయన కుటుంబ బాధ్యతను బాలకృష్ణ తీసుకున్న విషయం విధితమే. పిల్లల బాగోగులు చూసుకుంటూ, వారిని అప్పుడప్పుడు కలుస్తూ నేనున్నాంటూ భరోసా ఇస్తూ ఉంటారు. ఇటీవల బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి తారకరత్న కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ ఫోటోలను తాజాగా తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా నేను ఏ వైపు ఉన్నానని నన్ను ఎప్పుడూ అడుగుతూ వస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే.. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు మరియు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు బాలయ్యని ప్రశంసలతో అభినందిస్తున్నారు. బాబాయ్‌గా పెద్దరికం బాధ్యతలను నెరవేరుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా అలేఖ్య ఈ పోస్ట్ పెట్టడం విశేషం. అంటే రాజకీయాల్లో తన మద్దతు బాలకృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీకి అని ఆమె పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అలేఖ్యకు సమీప బంధువు అని సంగతి తెలిసిందే. కానీ ఆమె మాత్రం టీడీపీకే తన మద్దతు తెలియజేశారు. తారకరత్న మరణించే ముందు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటుకు గురై అకాలమరణం చెందారు.

More News

Duvvada Srinivas:తనపై భార్య పోటీకి దిగడంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్

ఏపీలో పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

TDP:శవ రాజకీయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే..

Pemmasani:అమరావతికి ఇంత ద్రోహం చేసిన జగన్‌కు బుద్ధి చెప్పాలి: పెమ్మసాని

ప్రజాధనాన్ని దోచుకుంటున్న నాయకులు, అధికారులను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని

CM Jagan and Sharmila:తల్లి విజయమ్మకు సీఎం జగన్, షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు

ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సింపుల్‌గా హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ ట్వీట్ చేశారు.

CM Revanth Reddy:ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.