Alekhya Reddy:కార్లలో నిద్రపోయాం..మన జీవితం అంత సాఫీగా సాగలేదు , నువ్వొక యోధుడివి: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి తారకరత్న అకాల మరణం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఆయన మన మధ్య లేడంటే ఇంకా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న భార్యాబిడ్డలను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. బయటివారికే ఇలా వుంటే.. తారకరత్న భార్య అలేఖ్య పరిస్ధితి ఏంటి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ముగ్గురు బిడ్డలతో ఆమె అనాథగా మారింది. తారకరత్న చినకర్మ నాడు కూడా అలేఖ్య రోదిస్తూనే వున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసినా .. అన్నీతానై కంటికి రెప్పలా చూసుకున్న భర్త ఇకలేడని నిజాన్ని ఇంకా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.
నీలాగా మమ్మల్ని ఎవరూ ప్రేమించలేదు :
ఇదిలావుండగా అలేఖ్య రెడ్డి శుక్రవారం తన భర్త తారకరత్నపై ప్రేమను తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మనం కలిసి వుండేందుకు ఎంతో పోరాటం చేశాం.. చివరి వరకు పోరాడుతూనే వున్నామన్నారు. కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి నేటి వరకు.. మన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఈ పోరులో మనిద్దరం చాలా దూరం వచ్చేశాం.. నువ్వొక వారియర్ నాన్నా, నువ్వు మమ్మల్ని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరంటూ తారకరత్న చేతిని తాను పట్టుకున్న ఫోటోను అలేఖ్య షేర్ చేశారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments