గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే...వాటి గురించి ఆలోచించను - తారకరత్న
- IndiaGlitz, [Wednesday,August 24 2016]
నందమూరి తారకరత్న, పంచి బొర, అనూప్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా వెంకటరమణ సాల్వ తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ ఎవరు. ఈ చిత్రాన్ని ముప్పా అంకం చౌదరి నిర్మించారు. డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఎవరు చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి తారకరత్నతో ఇంటర్ వ్యూ మీకోసం...
ఎవరు కథ ఏమిటి..?
డిఫరెంట్ గా ఉండే హర్రర్ థిల్లర్ ఇది. కమర్షియల్ ఫిల్మ్ అయినప్పటికీ చాలా నేచురల్ గా ఉంటుంది. ఒక ఇంట్లోనే సినిమా అంతా జరుగుతుంది. డైరెక్టర్ రమణ సాల్వ ఈ చిత్రాన్ని అంతా కొత్తవాళ్లతో చేయాలనుకున్నారట. అయితే...ఓ రోజు మా ప్రొడ్యూసర్... అంకం
చౌదరి గారు ఈ కథ గురించి చెప్పారు. డిఫరెంట్ గా ఉంది అనిపించడంతో వెంటనే చేస్తాను అని చెప్పాను. రెగ్యులర్ గా వచ్చే హర్రర్ కామెడీ ఇందులో ఉండదు. హర్రర్ థ్రిల్లర్స్ చాలా వచ్చినప్పటికీ మా సినిమా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది.
కామెడీ లేకపోతే....హర్రర్ కామెడీ ఇష్టపడే వాళ్లకి ఎవరు నచ్చకపోవచ్చు కదా..?
కామెడీ లేకపోయినా...ప్రతి సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో అని ఇంట్రస్ట్ గా చూసేలా ఉంటుంది. ఎక్కడా బోర్ అనిపించదు. అందుచేత మా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. మా డైరెక్టర్ రమణ సాల్వ ప్రతి సీన్ ని చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాడు. రవిబాబు తర్వాత నా ఫేవరేట్ డైరెక్టర్ ఎవరంటే రమణ సాల్వ పేరే చెబుతాను. అంతలా తన వర్క్ తో నన్ను ఆకట్టుకున్నాడు.
మీ పాత్ర ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్ గా నటించాను. హీరోయిన్ పంచి బొర తెలియని శక్తి గురించి అన్వేషిస్తుంటుంది. ఆమె నన్ను కలిసినప్పటి నుంచి ఇద్దరం కలిసి తెలియని శక్తి ఎవరు..? ఏం జరగనుంది..? ఎలా జరగబోతుంది అనే విషయం గురించి అన్వేషిస్తుంటాం. ఈ విధంగా నా పాత్ర ఉంటుంది.
ఈ చిత్రానికి ఫస్ట్ యామిని చంద్రశేఖర్ అనే టైటిల్ పెట్టారు కదా...ఆతర్వాత ఎవరు అని మార్చడానికి కారణం ఏమిటి..?
ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంద్రశేఖర్, హీరోయిన్ పంచి బొర క్యారెక్టర్ పేరు యామిని. అందుచేత యామిని చంద్రశేఖర్ అని టైటిల్ గా పెట్టాం. అయితే...యామిని చంద్రశేఖర్ అంటే ఫీల్ గుడ్ ఫిల్మ్ అని ఆడియోన్స్ ఫీలవుతారు అనిపించి కథకి యాప్ట్ గా ఉంటుందని ఎవరు గా మార్చాం.
మీకు హీరోగా నటించిన చిత్రాల కన్నా....విలన్ గా నటించిన అమరావతి, రాజా చెయ్యి వేస్తే...చిత్రాలు మంచి పేరు తీసుకువచ్చాయి కదా..! విలన్ గా ఆదరణ లభిస్తుండడం మీకు ఏమనిపిస్తుంటుంది..?
హీరో, విలన్ అనేది కాదండీ...! పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. తారకరత్న గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే కానీ...హీరోనా..విలనా అని ఆలోచించను. అందుకే సినిమాలు చేయడం లేట్ అయినా డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నాను.
మనమంతా చిత్రంలో చాలా చిన్న పాత్రలో నటించారు కదా..! క్యారెక్టర్ చిన్నదైనా చేయడానికి రెడీనా..?
ఇప్పటి వరకు వచ్చిన మంచి చిత్రాల్లో మనమంతా ఒకటి. ఇంకా చెప్పాలంటే మనమంతా గొప్ప సినిమా. ఈ సినిమాలో నటించడమే అదృష్టంగా భావిస్తున్నాను.
తుదుపరి చిత్రం గురించి..?
రాజా మీరు కేక అనే సినిమా చేస్తున్నాను. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తాను.