అందుచేత నాకు టైమ్ వస్తుందనే నమ్మకం ఉంది కానీ..అసంతృప్తి లేదు. - నందమూరి తారకరత్న
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ కథానాయకుడుగా -నందమూరి తారకరత్న ప్రతినాయకుడుగా రూపొందిన చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతినాయకుడు నందమూరి తారకరత్నతో ఇంటర్ వ్యూ మీకోసం..
రాజా చెయ్యివేస్తే..లో విలన్ గా నటించారు కదా..! విలన్ చేయమని అడిగినప్పుడు మీకు ఏమనిపించింది..?
డైరెక్టర్ ప్రదీప్ కథ చెప్పారు. అలాగే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్పారు. క్యారెక్టర్ బాగుంది. అయితే విలన్ క్యారెక్టర్ చేయాలా వద్దా అని డైలామా. అప్పుడు నిర్మాత సాయి గారు ఫోన్ చేసి నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. నా వైఫ్ కూడా చేయమనడంతో చేసాను.
అమరావతి తర్వాత మళ్లీ విలన్ గా చేసారు కదా.ఇంతకీ...మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుంది. దేనికి భయపడని మొండోడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. ఇప్పటి వరకు విలన్ అంటే..కామెడీ విలన్ ని చూసుంటారు. తనకు అడ్డువచ్చిన వాళ్లని చంపేసే విలన్ ని చూసుంటారు. కానీ ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో మంచి - చెడు ఉంటుంది. అలాగే ఈ క్యారెక్టర్ లో కూడా మంచి చెడు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..విలన్ ని కూడా ఆడియోన్స్ మెచ్చుకునేలా ఉంటుంది.
అమరావతిలో మీరు చేసిన విలన్ క్యారెక్టర్ కి నంది అవార్డ్ వచ్చింది కదా..ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కి అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నారా..?
అమరావతి సినిమా చేస్తున్నప్పుడే డైరెక్టర్ రవిబాబు గారు నీకు అవార్డ్ వస్తుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్టే అవార్డ్ వచ్చింది. అమరావతి సినిమాకు గాను నాకు అవార్డ్ వచ్చిందంటే ఆ క్రెడిట్ రవిబాబు గార్కే చెందుతుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ డ్రెస్ ఇలా..అన్ని రకాలుగా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే అవార్డ్ వస్తుందా రాదా అనేది నేను చెప్పడం కన్నా సినిమా చూసిన తర్వాత ఆడియోన్స్ చెబితే బాగుంటుంది.
ఫస్ట్ రోహిత్ అనుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారా..? లేక మీ తర్వాతే రోహిత్ ని సెలెక్ట్ చేసారా..?
ఫస్ట్ నన్ను అనుకున్న తర్వాతే హీరో రోహిత్ అయితే బాగుంటుంది అని సాయి గారు అనుకున్నారు. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ హీరో తో చేయడం ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ సాయి గారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు.
రోహిత్ తో వర్క్ చేయడం ఎలా ఉంది..?
రోహిత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మూడు నాలుగు రోజులు నిద్రలేకుండా కూడా ఈ సినిమా కోసం వర్క్ చేసాడు. ఈ సినిమాతో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. సో..రోహిత్ తో వర్క్ చేయడం హ్యాఫీగా అనిపించింది.
విలన్ గా కంటిన్యూ చేస్తారా..? ఇక నుంచి ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు..?
నా క్యారెక్టర్ బాగుంటే విలన్ గా చేస్తాను. అలాగే హీరోగా కూడా చేస్తాను. ముఖ్యంగా డిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా అన్నిరకాల పాత్రలు పోషించి మంచి నటుగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను.
హీరోగా చేసారు కానీ..సరైన బ్రేక్ రాలేదనే అసంతృప్తి ఉందా..?
లైఫ్ స్పీడ్ బ్రేకర్ లాంటిది అప్స్ & డౌన్స్ వస్తుంటాయి. నేను టైమ్ ని నమ్ముతాను. ఎప్పటికైనా నాకు మంచి టైమ్ వస్తుంది అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. అందుచేత నాకు టైమ్ వస్తుందనే నమ్మకం ఉంది కానీ..అసంతృప్తి లేదు.
వరుసగా ఎక్కువ సినిమాలు చేసిన మీరు ఈ మధ్య చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు కారణం ఏమిటి..?
నా కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఎక్కువ సినిమాలు చేయడం నేను చేసిన తప్పు. అందుచేత మంచి కథలను ఎంచుకోవడం కోసం ఎక్కువ టైమ్ తీసుకుని తక్కువ సినిమాలు చేస్తున్నాను.
కెరీర్ పరంగా మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని ఫ్యామిలీ మెంబర్స్ సలహాలు ఇస్తుంటారా..?
నాకు ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటే బాబాయ్ ని అడుగుతాను. అయితే నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను.
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉందా..?
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనైతే ఉంది. కాకపోతే ఇప్పుడు కాదు. ఫస్ట్ నటుడుగా ఇంకా మంచి పేరు సంపాదించి ఆర్టిస్ట్ గా సెటిలవ్వాలి. ఆతర్వాత అంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాను.
ఫ్యామిలీ మెంబర్స్ తో విభేదాలు ఏమైనా ఉన్నాయా..?
ఫ్యామిలీతో ఎటువంటి విభేదాలు లేవు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్.. ఎవరికి వారు షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కలవడం తక్కువ.అయితే.. టైమ్ కుదిరినప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎవరికివారు బిజీగా ఉండడం వలన కలవడం లేదు అంతే తప్పా... మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
పెళ్లి తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చిందా..?
పెళ్లి తర్వాత నాలో ఏ మార్పు రాలేదు. కాకపోతే నా వైఫ్ నేను ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది...ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తదితర విషయాల గురించి చెబుతూ నన్ను ప్రొత్సహిస్తుంటుంది. అంతకు మించి పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో నటిస్తున్నారా..?
ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఈ సినిమాలో అలా వచ్చి...ఇలా వెళ్లిపోయే చిన్న సీన్ అయినా ఫరవాలేదు. ఈ మూవీలో నటించే అవకాశం వస్తే గ్రేట్ అని నా ఫీలింగ్.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
రమణ సాల్వ దర్శకత్వంలో ఎవరు అనే సినిమా చేస్తున్నాను. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరు రిలీజ్ ఎప్పుడనేది ఫైనల్ చేస్తాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com