రామయ్య సన్నిధిలో తారక్
- IndiaGlitz, [Friday,November 10 2017]
భద్రాద్రి రాములవారి సన్నిధిలో ఎన్టీఆర్ శుక్రవారం గడిపారు. భద్రాద్రి రామాలయానికి ఆయన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. చిన్నతనంలో ఆయన రాముడిగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నటించగా దసరాకు విడుదలైన 'జై లవకుశ' కూడా రామాయణాన్ని నేపథ్యంగా తీసుకున్నదే.
శుక్రవారం ఆలయానికి చేరుకున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు ఆలయ నిర్వహకులు ఆహ్వానం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కుటుంబం కూడా రాములవారిని దర్శించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివకు భద్రాద్రి రామాలయానికి మంచి అనుబంధం ఉంది. ఆయన తరచూ భద్రాద్రి రాముల వారిని సందర్శించుకుంటూ ఉంటారు.