బాయ్‌ఫ్రెండ్ పేరు బ‌య‌ట పెట్టిన బ్యూటీ

  • IndiaGlitz, [Monday,May 11 2020]

సాధార‌ణంగా హీరోయిన్స్ సినిమాల్లో బిజీగా ఉన్న‌ప్పుడు ప్రేమ‌, పెళ్లి గురించి వార్త‌లపై పెద్ద‌గా మాట్లాడ‌రు. త‌మ ఫోక‌స్ అంతా కెరీర్‌పైనే పెడ‌తారు. అలా ఉంటేనే కానీ అవ‌కాశాలు రావ‌ని వారి న‌మ్మ‌కం. అదే బాట‌లో సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ కూడా చేరింది. ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన తాప్సీకి అనుకున్న స్థాయిలో స‌క్సెస్‌లు ద‌క్క‌లేదు. ఐర‌న్‌లెగ్ భామ‌గా పేరు సంపాదించుకుంది. అదే స‌మ‌యంలో ఆమె న‌టించిన బాలీవుడ్ చిత్రం నామ్ ష‌బానా మంచి హిట్ సాధించ‌డంతో తాప్సీ బ్రేక్ సంపాదించుకుంది. అక్క‌డ నుండి అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో తాప్సీ వ‌రుస విజ‌యాలు సాధించింది.

కొన్నాళ్ల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో తాప్సీ తాను సినిమా రంగానికి సంబంధం లేని వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పింది కానీ.. ఆ వ్య‌క్తి పేరు మాత్రం చెప్ప‌లేదు. అయితే రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తాప్సీ త‌న బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పింది. త‌న బాయ్‌ఫ్రెండ్ పేరు మాథియాస్ బో అని చెప్పింది. త‌నొక బాడ్మింట‌న్ ప్లేయ‌ర్ అని చెప్పింది. త‌న త‌ల్లిదండ్రుల‌కు కూడా త‌న ప్రేమ గురించి తెలుసున‌ని కూడా చెప్ప‌డం విశేషం. అయితే పెళ్లి గురించి మాత్రం నోరు విప్ప‌లేదు.