తాప్పీ ఆ పని స్టార్ట్ చేసేసింది...
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల నాయిక తాప్సీ టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం రానా, తాప్సీ నటిస్తున్న చిత్రం ఘాజి. చిత్రంలో రానా నావీ ఆఫీసర్‌గా కనపడుతున్నాడు. ఇండియా, పాకిస్థాన్‌కు జరిగిన యుద్ధ సమయంలో ఘాజీ అనే యుద్ధ నౌకకు ఏమైందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ కె.కె.మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో తాప్సీ ఓ బంగ్లాదేశీ రెఫ్యూజీ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే మిగిలిన భాష్లో సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com