అమితాబ్‌పై తాప్సీ కౌంటర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సొట్టబుగ్గల సొగసరి తాప్సీ పన్ను ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. తెలుగులో ఎలాంటి సక్సెస్‌లు రాకపోవడంతో ఐరల్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. బేబీ, నామ్ షబానా, బద్లా వంటి చిత్రాలతో తాప్సీ బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. పేరుతో పాటు వరుస అవకాశాలను దక్కించుకుంది. అయితే బాలీవుడ్ వెళ్లిన తర్వాత తెలుగు సినిమాల్లో హీరోలదే డామినేషన్ అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. రాఘవేంద్రరావు టేకింగ్‌ను కామెంట్ చేసింది. అయితే తెలుగు సినిమా ఫ్యాన్స్ ఫైర్ కావడంతో నేనలా అనలేదు. వేరే అర్థంలో అన్నానంటూ మాట మార్చింది.
తాజాగా ఈమె మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. అదేంటంటే.. బద్లా సినిమాలో అమితాబ్, తాను నటించామని, ఆయన కంటే తానే ఎక్కువ సీన్స్‌లో నటించినా ఆ సినిమాను అమితాబ్ సినిమా అన్నారంటూ వాపోయింది. అలాగే పారితోషకాల విషయంలోనూ వివక్షత ఉందని, ఎంత కష్టపడినా హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్స్ ఇవ్వడం లేదని తెలిపింది. రెమ్యునరేషన్స్ గురించి పక్కన పెడితే అమితాబ్ గురించి తాప్సీ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. సోషల్ మీడియా తాప్సీ చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో అమితాబ్ ఫ్యాన్స్ తాప్సీపై గట్టిగానే పైర్ అవుతున్నారు. మరిప్పుడు తాప్సీ తన చర్యలను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments