అమితాబ్‌పై తాప్సీ కౌంటర్‌.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

  • IndiaGlitz, [Tuesday,November 26 2019]

సొట్టబుగ్గల సొగసరి తాప్సీ పన్ను ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది. తెలుగులో ఎలాంటి సక్సెస్‌లు రాకపోవడంతో ఐరల్‌ లెగ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. బేబీ, నామ్‌ షబానా, బద్లా వంటి చిత్రాలతో తాప్సీ బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. పేరుతో పాటు వరుస అవకాశాలను దక్కించుకుంది. అయితే బాలీవుడ్‌ వెళ్లిన తర్వాత తెలుగు సినిమాల్లో హీరోలదే డామినేషన్‌ అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. రాఘవేంద్రరావు టేకింగ్‌ను కామెంట్‌ చేసింది. అయితే తెలుగు సినిమా ఫ్యాన్స్‌ ఫైర్‌ కావడంతో నేనలా అనలేదు. వేరే అర్థంలో అన్నానంటూ మాట మార్చింది.

తాజాగా ఈమె మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. అదేంటంటే.. బద్లా సినిమాలో అమితాబ్‌, తాను నటించామని, ఆయన కంటే తానే ఎక్కువ సీన్స్‌లో నటించినా ఆ సినిమాను అమితాబ్‌ సినిమా అన్నారంటూ వాపోయింది. అలాగే పారితోషకాల విషయంలోనూ వివక్షత ఉందని, ఎంత కష్టపడినా హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్స్‌ ఇవ్వడం లేదని తెలిపింది. రెమ్యునరేషన్స్‌ గురించి పక్కన పెడితే అమితాబ్‌ గురించి తాప్సీ చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. సోషల్‌ మీడియా తాప్సీ చేసిన కామెంట్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో అమితాబ్‌ ఫ్యాన్స్‌ తాప్సీపై గట్టిగానే పైర్‌ అవుతున్నారు. మరిప్పుడు తాప్సీ తన చర్యలను ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.

More News

విజయ్‌ దేవరకొండ ముందే ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను విమర్శించిన హీరోయిన్‌

మన గురించో, మనకు ఇష్టమైన వారి గురించి వేరే వాళ్లు విమర్శిస్తే మనకెంతో బాధగా ఉంటుంది. మనం అక్కడ నుండి పక్కకు వెళ్లిపోతాం

ఇంకా ఆ స్టార్‌ హీరోలకు పాటలు పాడాలంటున్న రాహుల్‌ సిప్లిగంజ్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌  సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ నేటి తరం అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్‌, మహేశ్‌, రాంచరణ్‌, బన్నీ సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే.

రోజాకు ఛాలెంజ్‌ విసిరిన బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌

రోజా ముఖం మీద తన మనసులో మాటలను చెప్పేస్తుంటారు. కొందరు ఈమెను ఫైర్‌ బ్రాండ్‌ అని అంటే..

‘రూలర్‌' ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మాతగా రూపొందుత్నో చిత్రం ‘రూలర్‌'.

మహా’ ట్విస్ట్.. సీఎం ఫడ్నవిస్, అజిత్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ రాజీనామా చేయగా..