తాన్యా... హోప్ ఫలించినట్టేగా
- IndiaGlitz, [Monday,July 22 2019]
కాస్త అందం, అభినయం ఉన్న హీరోయిన్లు ఓ మోస్తరు హీరోల పక్కన నటించడం పరిపాటి. మరో అడుగు ముందుకేసి రవితేజలాంటి వారి సరసన నటించడమంటే... ప్రమోషన్ వచ్చినట్టేనా. అదే నిజమైతే ఇప్పుడు తాన్యా హోప్‌కి కూడా ప్రమోషన్ వచ్చింది. 'అప్పట్లో ఒకడుండేవాడు', 'పటేల్ సర్', 'పేపర్ బోయ్' వంటి సినిమాల్లో నటించిన తాన్యా హోప్‌కి తాజాగా రవితేజ 'డిస్కో రాజా'లో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ఇందులో ఆమె సోలో హీరోయిన్ కాదు. ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తన్నారు. పాయల్‌కు 'ఆర్.ఎక్స్.100' హిట్ ఉంది. నభా కెరీర్‌లో తొలి చిత్రంతో పాటు ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' కూడా హిట్టే. సో హిట్ పరంపరలో ఉన్న భామల మధ్య హిట్ కోసం వెయిట్ చేస్తున్న భామను కూడా రవితేజ యాక్సెప్ట్ చేశారన్నమాట. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర పరిధి ఎంత అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం.