అమితాబ్ పై తను శ్రీ కామెంట్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు నానా పటేకర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కొంత మంది ఈ విషయంపై తనుశ్రీకి సపోర్ట్‌గా మాట్లాడితే రాఖీ సావంత్ వంటి వ్యక్తులు నానా పటేకర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఇలాంటి తరుణంలో అమితాబ్‌ను ఈ విషయంపై స్పందించమని మీడియా అడిగితే.. నా పేరు తను శ్రీ కాదు.. నేను నానా పటేకర్‌ని కాను అంటూ ఆయన సమాధానమిచ్చారు.
దీనికి ప్రతిగా తను శ్రీ దత్తా స్పందిస్తూ.. "ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించని ఇలాంటి వాళ్లు సమాజాన్ని ఉత్తేజ పరిచే సినిమాల్లో నటిస్తారు..ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు .. కానీ.. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే స్పందించరు.
చాలా మంది ప్రముఖులు నాకు మద్ధతుని తెలుపుతున్నారు. నేను బాలీవుడ్‌కి తిరిగిరాను. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా వెళ్లిపోతాను. ఈ అవమానంతో నేను ఎంతో నలిగిపోయాను. ప్రజల నుండి ఎలాంటి స్పందన కానీ.. ఖండన కానీ లేదు" అని అమితాబ్‌ను టార్గెట్ చేస్తూ తను శ్రీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com