దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చ్ నెల‌లో విడుద‌ల‌కు ముస్తాబౌతున్న ఈ చిత్రం తాజాగా త‌న డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంతో త‌నీష్ త‌న‌లోని గాయ‌కుడిని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. హే పైసా అంటూ డ‌బ్బు పై వ‌చ్చే ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ని త‌నీష్ స్వ‌యంగా ఆల‌పించాడు. ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , హ‌ర్యానా, సిమ్లా వంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రించారు. దేశ‌దిమ్మ‌రి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన‌ సంగీతం , ప్ర‌దీష్ ఆంటోని కొరియోగ్ర‌ఫీ రెండు హైలైట్ గా ఉంటాయ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు న‌గేష్ నార‌దాసి చెప్పారు.

ఈ చిత్రానికి నంద‌మూరి హ‌రి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గా , మ‌ల్లిఖార్జున్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ముస్తాబౌతున్న త‌మ దేశ‌దిమ్మ‌రి చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు న‌గేష్ నారాదాసి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు..

More News

'రాజరథం' లో నిరూప్ భండారి చెప్పిన 'దెయ్యం కథ'

నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో  అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న 'రాజరథం' చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు.

'సత్య గ్యాంగ్' సాంగ్స్ సూపర్ అంటున్నారు!!

సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్'.

క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో సాయిధ‌ర‌మ్ చిత్రం?

మానవతా విలువలు గల సినిమాలను తెరపై ఆవిష్కరించడంలోనూ.. ఉత్కంఠ‌భరితమైన మూవీలను తెరకెక్కించడంలోనూ..  ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించడంలోనూ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు.

ఈ వారంలోనే 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌' ఫ‌స్ట్ సింగిల్‌

"పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్ కి వచ్చారు కాబట్టే నా 'ఇష్క్' సినిమా పెద్ద హిట్ అయ్యింది" అని చెప్పుకునే నితిన్‌కు... ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నిర్మాణంలో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. ఆ చిత్ర‌మే 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'.

ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌లో నంద‌మూరి త్ర‌యం?

సీనియర్ నటుడు హరికృష్ణ మళ్ళీ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు. సుమారు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ హరికృష్ణ తెరపై కనిపించనున్నారు.