తనీష్ ఓ 'దేశ దిమ్మరి'

  • IndiaGlitz, [Sunday,December 31 2017]

సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం దేశదిమ్మరి'. నగేష్ నారదాశి దర్శకత్వంలో తనీష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకుంది‌. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ. మానవత్వ విలువలను చాటి చెప్పే చిత్రమిది. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది తప్ప.. అత్యాశను కాదు అనే సిద్దాంతాన్ని నమ్మే ఓ యువకుడి కథే ఈ దేశ దిమ్మరి. డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే ఓ వైవిధ్యభరితమైన కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. పంజాబ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలొ షూటింగ్ చేశాము. పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలొ సినిమాను విడుదల చెస్తామన్నారు‌.