'అంతర్వేదం' బృందం కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది - తనికెళ్లభరణి
- IndiaGlitz, [Saturday,July 14 2018]
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం అంతేర్వేదమ్ .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆడియోను సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీని చిత్రంలో కీలకపాత్ర పోషించిన తనికెళ్లభరణికి అందించారు.
ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ.. మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్ళందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. యువత ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటున్నారు కానీ.. అంతర్వేదం చిత్రంలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది అన్నారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వాళ్ళందరూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను అన్నారు.
స్టార్ రైటర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. నాకు హీరోయిన్ సంతోషి అంటే చాలా రెస్పెక్ట్. నన్ను ఇన్వైట్ చేయడానికి హీరో-విలన్ వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. సినిమా మీద వాళ్ళకి ఉన్న ప్యాషన్ అప్పుడు అర్ధమైంది. తప్పకుండా అందరూ మంచి విజయం అందుకోవాలి అన్నారు.
దర్శకుడు చందిన రవికిషోర్ మాట్లాడుతూ.. నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళభరణిగారు మొదలుకో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను అన్నారు.
చిత్ర కథానాయకుడు అమర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ రవి, నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పట్నుంచి. తను చేసే ఫస్ట్ సినిమాతోనే నన్ను హీరోను చేశాడు మా రవి. చాలా కష్టపడి క్రౌడ్ ఫండింగ్ తో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకోకుండా తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్ధం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకొంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ రాంప్రసాద్, రైజింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, కమెడియన్ సాయి, జబర్దస్త్ మహేష్ ,దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్ గా జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు. ఎడిటర్: కళ్యాణ్, సహ-నిర్మాత: ఎస్.ఎన్