చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగానూ.. అంతకు మించి రచయితగానూ తెలుగు ప్రేక్షకులకు తనికెళ్ల భరణి సుపరిచితులు. సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన జీవించేస్తారు. అలాగే రచయితగానూ ఆయనకు ఆయనే సాటి. ఆయన జీవితంలో నిన్న మొన్నటి వరకైతే వివాదాలు, విమర్శలకు తావు లేదు. కానీ తాజాగా తనకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టిన 'శబ్బాష్ రా శంకరా' కవితలు ఆయనను విమర్శలపాలు చేశాయి. ‘శబ్బాష్ రా శంకరా’ పేరుతో తనికెళ్ల ఓ పుస్తకాన్ని ప్రచురించారు. దీనికి కొనసాగింపుగానే ఫేస్‌బుక్ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పడమే కాకుండా.. విమర్శలకు కారణమైన పోస్టును సైతం ఆయన డిలీట్ చేశారు. "ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శబ్బాష్ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొంతమంది మనసులు నొప్పించడం, బాధ కలిగించడం చేసింది. దానికి నేను వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది కాబట్టి నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటున్నా. ఆ పోస్టు కూడా డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే హక్కు, అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా’’ అని తనికెళ్ల భరణి ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments