చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి

నటుడిగానూ.. అంతకు మించి రచయితగానూ తెలుగు ప్రేక్షకులకు తనికెళ్ల భరణి సుపరిచితులు. సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన జీవించేస్తారు. అలాగే రచయితగానూ ఆయనకు ఆయనే సాటి. ఆయన జీవితంలో నిన్న మొన్నటి వరకైతే వివాదాలు, విమర్శలకు తావు లేదు. కానీ తాజాగా తనకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టిన 'శబ్బాష్‌ రా శంకరా' కవితలు ఆయనను విమర్శలపాలు చేశాయి. ‘శబ్బాష్ రా శంకరా’ పేరుతో తనికెళ్ల ఓ పుస్తకాన్ని ప్రచురించారు. దీనికి కొనసాగింపుగానే ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆయన తాజాగా పోస్ట్‌ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పడమే కాకుండా.. విమర్శలకు కారణమైన పోస్టును సైతం ఆయన డిలీట్ చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన శబ్బాష్‌ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొంతమంది మనసులు నొప్పించడం, బాధ కలిగించడం చేసింది. దానికి నేను వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది కాబట్టి నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటున్నా. ఆ పోస్టు కూడా డిలీట్‌ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే హక్కు, అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా’’ అని తనికెళ్ల భరణి ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

More News

కమెడియన్ వివేక్ కన్నుమూత

కోలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వివేక్(59) గుండెపోటుతో శ‌నివారం ఉద‌యం ఐదు గంట‌ల‌కు క‌న్నుమూశారు.

పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

అక్కడ మాత్రం మెప్పించలేకపోయిన ‘జాతిరత్నాలు’

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ మార్చుకుందట..

లవ్ స్టోరీలను సైతం నీట్ అండ్ క్లీన్‌గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి

ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో