‘ఆమె’ చూసి షాకైన తమ్మారెడ్డి.. వారిని తరిమికొట్టాలని పిలుపు!!

  • IndiaGlitz, [Monday,July 22 2019]

కోలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లాపాల్ ప్రధాన పాత్రలో న‌టించిన థ్రిల్లర్ సినిమా ‘ఆమె’. ఈ చిత్రం ఎన్నో వివాదాలు, నిరసనల మధ్య ఎట్టకేలకు ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చేసింది. తమిళ ‘ఆడై’ సినిమాకు తెలుగు వ‌ర్షన్ వచ్చిన ‘ఆమె’ భిన్నమైన కాన్సెప్టు కావడంతో ద‌ర్శకుడు ర‌త్నకుమార్‌పై సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మంచి హిట్ టాక్‌తో ఈ సినిమా విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.

షాకయ్యా.. గర్వపడుతున్నా!

ఈ 40 ఏళ్లల్లో ఎన్నో సినిమాలు చేశాం. కానీ నేను ‘ఆమె’ను చూసి నేను షాకయ్యాను. క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అవుతుంద‌నుకుని ముందు సినిమాలో దిగామని అయితే చూశాక అస‌లు ఈ క‌థ ద‌ర్శకుడు ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? నిర్మాత ఎలా తీశాడు? వ‌ంటివ‌న్నీ ఆలోచించాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ప్యాష‌న్ ఉండాలి. అది లేనివారు దీన్ని గురించి ఆలోచించ‌డానికి కూడా భ‌య‌ప‌డుతారు. నేను అమ‌లాపాల్ పెర్ఫార్మెన్స్ చూసి షాక‌య్యాను. ఈ జ‌న‌రేష‌న్‌లో ఇంత గొప్పగా పెర్ఫార్మ్ చేసిన వాళ్లు లేరు. నిజంగా ఓ సినిమాకోసం న్యూడ్‌గా నటించాలి అన్న ఆలోచన రావడమే గొప్ప అనుకుంటే సినిమాలో రెండో భాగంలో దాదాపు ఏ న్యూడ్ గానే కనిపిస్తుంది. ప్రస్తుతం సమాజంలో నేటి అమ్మాయిలు ఎలా ఉన్నారు అన్న దానికి నిదర్శనం ఈ సినిమా. ఈ సినిమా చేస్తున్నందుకు గ‌ర్వప‌డుతున్నా. అయితే సినిమా విడుదల రోజున విడుదల ఆగిపోవడం పెద్ద షాక్‌కి గురిచేసింది. దాదాపు మొదటి రోజు ఐదు షోల కలక్షన్ పోయాయి అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

తమిళ నిర్మాతలు కన్నెర్ర చేసిన తమ్మారెడ్డి!

ఈ సినిమా విషయంలో తమిళ నిర్మాతలు ఫ్రాడ్ చేసారు. నాలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఉండి కూడా సినిమా కిల్ అవ్వడం బాధగా ఉంది. కొన్ని సినిమాలకు మంచి రిలీజ్ టైం దొరకక కిల్ అవుతుంటాయి.. ఆ కోవలో మా సినిమా కూడా ఉంది. ఈ విషయంలో తమిళ నిర్మాతలు ఫ్రాడ్ చేశారు. ఇలాంటి ఫ్రాడ్స్ చాలా మంది ఉన్నారు.. వారిని పరిశ్రమ నుంచి తరిమికొట్టాలి. ఈ సినిమా కోసం అమలాపాల్ చాలా కష్టపడింది. రెమ్యూనరేషన్ మొత్తం దీనికి పెట్టడమే కాకుండా ఆమె దగ్గరున్న డబ్బులు కూడా పెట్టి సినిమాను విడుదల చేయించింది. నిజంగా అమలాపాల్ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు హ్యాట్సప్.. అంటూ తమ్మారెడ్డి తన ఇంటర్వ్యూని ముగించారు.

అయితే ఈ వివాదంపై తమిళ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి. వాస్తవానికి తమ్మారెడ్డే కాదు అమలాపాల్‌ నటన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. ఆమె ఏ సినిమా చేసినా సిన్సియర్‌గానే చేస్తుందన్న టాక్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు, తమ్మారెడ్డి ప్రశంసలపై అమలా ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

కేసీఆర్ ముందే స్టేజ్‌పై హరీశ్ రావు కంటతడి!!

అవును సీఎం కేసీఆర్ ముందే ట్రబుల్ షూటర్, కట్టప్పగా పేరుగాంచిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు.

చంద్రయాన్-2 సక్సెస్.. సత్తా చాటిన భారత్

యావత్ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్‌-2’ ఎట్టకేలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది.

కృష్ణ‌వంశీ 'న‌ట‌సామ్రాట్‌`' ఎవ‌రో తెలుసా?

కృష్ణ‌వంశీ సినిమా `అంతఃపురం`తో నిర్మాత‌గా మారారు న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌. 1999లో డ్యూయ‌ట్ మూవీస్ ప‌తాకంపై ప్ర‌కాష్‌రాజ్ తెర‌కెక్కించిన అంతఃపురం

కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే! - రైటర్ కమ్ హీరో ఆకాష్

కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు అందాల కథానాయకుడు, 'ఆనందం' ఫేమ్ ఆకాష్.

స‌మంత `96` లుక్ ఇదే...

స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న `96` తెలుగు రీమేక్ ఇమేజ్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.