30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలంటే.. : తమ్మారెడ్డి ట్రిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు కాకుంటే 33 రాజధానులు పెట్టుకోండని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రజాధనం వృథా చేసినట్టే..!
‘ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిగా అమరావతే ఉండాలని ఒకరు, కాదు.. కాదు మూడు రాజధానులు అని ఇంకొకరు అంటున్నారు. రాజధానులు ఎన్ని ఏర్పాటు చేసుకున్న అభ్యంతరం లేదు. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ.. రైతుల దగ్గర భూములు తీసుకున్న గత ప్రభుత్వం వారికి కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని నెరవేర్చాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. అమరావతిలో ఇప్పటికే బిల్డింగ్స్ నిర్మించి ఉన్నాయి. వాటిని వినియోగించకుండా.. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటే మళ్లీ పది నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చవుతాయి. అంత ఖర్చు చేయడమంటే ప్రజాధనం వృథా చేసినట్టే’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
30 ఏళ్లు సీఎంగా ఉండాలంటే..
అంతటితో ఆగని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘30 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్ అనుకుంటున్నారు.. ఆ విషయంలో జగన్‌ను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే.. అలా అనుకుంటున్న జగన్.. ఎవడితోనూ శాపం పెట్టించుకోకుండా ఉండగలగాలి. ఆ శాపం లేకుండా మంచి చేస్తాడు. వాళ్ల నాన్నలా జగన్ కూడా మంచిపేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు అని కోరుకుంటున్నాను’ అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అంటే జగన్‌కు తమ్మారెడ్డి ట్రిక్స్ ఇస్తున్నాడన్న మాట. తమ్మారెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు.. మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో మరి. అయితే.. జగన్ గురించి తమ్మారెడ్డి మాట్లాడటం ఇదేం మొదటి సారి కాదన్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments