'పల్లెవాసి' టీజర్ ను ఆవిష్కరించిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
Send us your feedback to audioarticles@vaarta.com
సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమై, కిరాక్ పార్టీతో అలరించిన నటుడు రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం` పల్లెవాసి`. సాయినాధ్ గోరంట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాం ప్రసాద్ నిర్మాత. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా `పల్లెవాసి` సినిమా టీజర్ ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా...
ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``ఫిల్మ్ ఛాంబర్లలోనో, స్టూడియోలలోనో కాకుండా నిజమైన పుస్తక ప్రేమికుల మధ్య హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో "పల్లెవాసి" సినిమా టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే దర్శకుడు నేటి సమాజం విస్మరించిన వ్యవసాయ రంగంపై ఒక చర్చను ముందుకు తీసుకొస్తున్నట్లు, పల్లెదనాన్ని వినూత్నంగా చిత్రీకరించారనిపిస్తోంది.ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
ప్రసిద్ధ పాటల రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ - `` పల్లెసీమ నేపథ్యంలో మంచి కథని ఎంచుకొన్న చిత్రబృందానికి అభినందనలు. సినిమా విజయవంతం కావాలి`` అన్నారు.
నటుడు రాకేందు మౌళి మాట్లాడుతూ - `` అక్షరంమీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చిన నా తొలిచిత్రం టీజర్ఆవిష్కరణ పుస్తకాల, పుస్తకాభిమానుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. పల్లెవాసి సినిమా పాటలు, మాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో పదికాలాల పాటు నిలుస్తాయి``అన్నారు
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ - “పల్లె వాసి" టీజర్ చూస్తుంటే.. గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతుందో” పాటకు విశ్వరూపంగా ఉంది`` అన్నారు.
దర్శకుడుసాయినాధ్ గోరంట్ల మాట్లాడుతూ - ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఔట్ ఫుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా `పల్లెవాసి` టీజర్ ను విడుదల చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అన్నారు.
నిర్మాత రాం ప్రసాద్ మాట్లాడుతూ - భరద్వాజ గారు మా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. " పల్లె వాసి" సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది" అన్నారు
కార్యక్రమంలోకెమెరామెన్ చామంతి లక్ష్మణ్ రాజ్, దర్శకులు కె. సందీప్ కుమార్, సహ నిర్మాత ఉదయ్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout