Tammareddy:బూతులు నాకూ వచ్చు, కానీ సంస్కారం అడ్డొస్తోంది.. నాకు ఐడెంటిటీ అక్కర్లేదు: నాగబాబుకు తమ్మారెడ్డి కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రం యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను గెలవాలని అంతా కోరుకుంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తమ మద్ధతు సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఖర్చు పెడుతున్న మొత్తంతో 8 సినిమాలు తీయొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణం కోసం రూ.600 కోట్ల బడ్జెట్ అయ్యిందని.. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ దక్కించుకునేందుకు చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై నందమూరి, మెగా అభిమానులతో పాటు నెటిజన్లు భగ్గుమన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఇష్టం లేదా అంటూ వారు మండిపడుతున్నారు. ఇక సీనియర్ దర్శకుడు కే . రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబులు కూడా ఘాటుగా స్పందించడంతో వివాదం మరింత పెద్దదైంది.
ఒకరేమో లెక్కలు , ఇంకొకరు అమ్మ మొగుడిని అంటున్నారు:
అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో తమ్మారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఇలా అన్నారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ఓ సెమినార్ జరిగింది. జాతీయ అవార్డ్ గ్రహీత రాజేశ్ టచ్ రివర్‌కి సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సినిమా ఎలా తీయాలని కొందరు విద్యార్ధులు తనను ప్రశ్నించగా.. తాను వివరిస్తూ సినిమాలు రెండు రకాలని అవి అవార్డుల కోసం , రివార్డుల కోసం అని రెండు వుంటాయని చెప్పా. నంది అవార్డ్, నేషనల్ అవార్డ్ గురించి చెబుతూ.. ఆర్ఆర్ఆర్ ప్రస్తావన వచ్చింది. ఆస్కార్‌కు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పా. అంత డబ్బుతో మనం ఎక్కువ సినిమాలు తీయొచ్చని చెప్పా.. అందువల్ల అలాంటి వాటిని మనం అస్సలు ట్రై చేయొద్దని చెప్పా. అలా రెండున్నర గంటలు మాట్లాడితే.. ఒక్క నిమిషం మాట్లాడిన క్లిప్పింగ్ పట్టుకుని వాళ్లు రియాక్ట్ అవుతున్నారు. ఇందులో వారి తప్పేంలేదు.. కానీ ఒకరేమో లెక్కలు , ఇంకొకరు అమ్మ మొగుడిని అంటున్నారు. దానికి కొంచెం హర్ట్ అయ్యా.
నాకూ బూతులు వచ్చు :
చాలా అసహ్యంగా , అసభ్యంగా వుంది. తనకు కూడా బూతులు వచ్చని.. కానీ తనకు సంస్కారం వుంది. నేను రియాక్ట్ అయి విషయాన్ని మరింత పెద్దది చేయాలని లేదు. నాకు ఇప్పుడు ఐడెంటిటి క్రైసిస్ లేదు.. నన్ను టార్గెట్ చేసి వాళ్లు ఐడెంటిటీ పెంచుకోవాలనుకుంటున్నారేమో. అసలు ఈ వివాదం జరగడానికి ముందు రాజమౌళిని అభినందించాలని చెబుతూ ఓ వీడియో పెట్టా. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. బూతులు మాట్లాడటం తనకూ వచ్చు.. కానీ తనకు అంత అవసరం లేదు. నా తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారు.. అది కోల్పోవడం నాకు ఇష్టం లేదు’’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ముగించారు. మరి ఆయన వివరణకు రాఘవేంద్రరావు, నాగబాబులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout