ఆ నిర్మాతల వల్ల నష్టపోయాను : తమ్మారెడ్డి భరద్వాజ
- IndiaGlitz, [Tuesday,July 23 2019]
సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఈమధ్య తెలుగులో విడులైన చిత్రం 'ఆమె'. తమిళంలో 'అడై' పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. జూలై 19న సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల ఒకరోజు ఆలస్యమైంది. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 'తమిళ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్, తెలుగు నిర్మాతలు డబ్బులు చెల్లించేశారు. కానీ నిర్మాత, ఫైనాన్సియర్‌కు డబ్బులు చెల్లించలేదు.
దీంతో ఫైనాన్సియర్స్ సినిమాను విడుదల కానీయలేదు. సినిమాపై ఉన్న బజ్‌కు అనుకున్న సమయంలో విడుదల కాకపోవడంతో తెలుగు నిర్మాతలకు నష్టం వాటిల్లింద'ని తమ్మారెడ్డి తెలిపారు. తమిళ నిర్మాతలపై తెలుగు నిర్మాతల మండలిలో కేసులు పెట్టామని కూడా ఆయన తెలియజేశారు. సినిమా విడుదల కోసం అమలాపాల్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు.. అలాగే తనే ఫైనాన్సియర్స్‌కు డబ్బులు కూడా ఇచ్చిందట. మరి దీనిపై నిర్మాతల మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.