బిగ్‌బాస్ షో పై త‌మిళ‌నాడు సీఎం సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

  • IndiaGlitz, [Friday,December 18 2020]

సినిమా స్టార్స్‌కి, రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే సినిమా స్టార్స్ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే మాత్రం విమర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది డైరెక్ట్‌గా కావ‌చ్చు. ఇన్‌డైరెక్ట్‌గా కావ‌చ్చు. త‌మిళ‌నాడులో రీసెంట్‌గా జ‌రిగిన ఐటీ దాడుల్లో లెక్క‌లోకి రాని డ‌బ్బుని అధికారులు సీజ్ చేశారు. దీనిపై స్పందించిన క‌మ‌ల్ హాసన్ పార్టీ ప్ర‌తినిధులు.. ప‌ళ‌ని సామి ప్ర‌భుత్వం అవినీతిని ప్రోత్స‌హిస్తుందంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ప‌ళనిసామి ఊరుకుంటారా?  విలేఖ‌రులు ఇదే ప్ర‌శ్న‌పై స్పందించ‌మ‌ని కోర‌గా త‌న‌దైన శైలిలో క‌మ‌ల్ హాస‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ‘‘ఏడు ప‌ద‌లు వ‌య‌సులో క‌మ‌ల్‌హాస‌న్ బిగ్‌బాస్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి షోను హోస్ట్ చేయ‌డం వ‌ల్ల పిల్ల‌లు పాడ‌వుతున్నారు. అలాగే ఇలాంటి షోస్ వ‌ల్ల కుటుంబాల‌కు ఏమైనా మేలు జ‌రుగుతుందా? అంటే అదీ ఉండ‌దు. అలాంటి షోస్ చేసే వ్య‌క్తుల మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌స‌ర‌రం లేదు’’ అని బ‌దులిచ్చారు.

త‌మిళ‌నాడు రాజకీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌కు, పాలిటిక్స్‌కు అవినాభావ సంబంధం ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉన్న రాజ‌కీయ పార్టీల‌ను కాద‌ని ఇద్ద‌రు బిగ్‌స్టార్స్ పాలిటిక్స్‌లో కాలు పెడుతున్నారు. అందులో ఒక‌రు ర‌జినీకాంత్ కాగా.. మ‌రొక‌రు క‌మ‌ల్‌హాస‌న్‌. వీరిద్ద‌రిలో ఇప్ప‌టికే క‌మ‌ల్‌హాస‌న్ పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. రజినీకాంత్ మాత్రం డిసెంబ‌ర్ 31న పార్టీ పేరుని, గుర్తుని అనౌన్స్ చేసి, జ‌న‌వ‌రిలో పార్టీని అధికారికంగా స్టార్ట్ చేయ‌నున్నారు. మ‌రి పార్టీని ప్రారంభించిన త‌ర్వాత ర‌జినీకాంత్ ఎన్ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటారో చూడాలి.