సమంత సిరీస్‌కు తమిళుల సెగ
Send us your feedback to audioarticles@vaarta.com
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రయిలర్‌పై తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళులకు వ్యతిరేకంగా సిరీస్ తీశారని తిట్టిపోస్తున్నారు. సమంత పాత్ర వాళ్ళకు నచ్చలేదు. దాంతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు నష్టాలు తప్పదని ట్వీట్లు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.
సమంతను ఎల్‌టిటిఈ టెర్రరిస్ట్‌గా చూపించడంపై తమిళ నెటిజన్లు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్, ప్రైమ్ వీడియో మీద మండిపడుతున్నారు. #FamilyMan2_against_Tamils హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ ప్లేస్‌లో వుంది. ప్రైమ్ వీడియోను అన్ సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్టు కొందరు ట్వీట్లు చేశారు. ఇంకొందరు ఓ స్ట్రాటజీ ప్రకారం తమిళులపై కుట్ర జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
సమంత సినిమాలను బాయ్‌కాట్ చేస్తామని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సమంత తమిళ యాసపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిరీస్ క్రియేటర్స్ రాజ్, డీకే నుంచి క్షమాపణలు కోరుతున్నామని ఇంకో ట్వీట్. హాలీవుడ్ సినిమాల్లో రష్యన్లు, క్యూబన్లను క్రూరులుగా చూపించి వాళ్ళపై ఎలాగయితే ద్వేషాన్ని కలిగించారో, అదే విధంగా తమిళులపై ద్వేషం కలిగే విధంగా సిరీస్ ఉందని ఒకరు అభిప్రాయపడ్డారు.
చరిత్ర గురించి తెలియకపోతే మాట్లాడవద్దని, తమిళుల మనోభావాలను కించపరిచినందుకు సిరీస్ బ్యాన్ చేయాలని ఒక నెటిజన్ కోరారు. "తమిళుల హక్కుల కోసం పోరాడిన వాళ్ళను ఊచకోత కోయడానికి శ్రీలంకకు పాకిస్థాన్ సాయం చేసింది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో తమిళులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఓటు వేసింది. చరిత్ర అలా వుంటే... కట్టుకథను ప్రచారం చేయమని ఎవరు చెప్పారు? ఫేక్ ప్రోపగాండా ఆపండి" అని రాజ్, డీకేకు ఒకరు సూచించారు. ట్రయిలర్‌ను డిస్ లైక్ చేయడం స్టార్ట్ చేశారు.
ట్రయిలర్‌కు వస్తున్న వ్యతిరేకతపై సమంత స్పందించడం లేదు. మౌనం వహించారు. తమిళనాడులో సెంటిమెంట్లు బలంగా వుంటాయి. పైగా, సమంత తమిళ అమ్మాయి. ఆమెకు తెలియనిది కాదు. తమిళ సెగపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments