కళ్యాణ్ రామ్ చిత్రానికి తమిళ రచయితలు...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు కోలీవుడ్‌లోని ప్రముఖ రచయితలు సుభా(సుభాష్ బాలక్రిష్ణన్)లు వర్క్ చేయనున్నారట.
మంచి స్క్రీన్‌ప్లే రైటర్స్‌గా వీరికి తమిళ ఇండస్ట్రీలో మంచి పేరుంది. రంగం, అనేగన్, ఐ సహా పలు విజయవంతమైన చిత్రాలకు వీరు రచయితలుగా పనిచేశారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాకు వీరు పనిచేయడం చూస్తుంటే నిర్మాతలు కళ్యాణ్‌రామ్‌కు ఎలాగైనా హిట్ ఇప్పించాలని స్టార్ టెక్నిషియన్స్‌ను అంతా రంగంలోకి దింపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments