చిరు పాత్రలో సైరా అంటున్న తమిళ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చదవగానే మరోసారి చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` తమిళంలో రీమేక్ అవుతుందనుకుంటారేమో!.. కానీ అసలు విషయం అది కాదు. `సైరా నరసింహారెడ్డి` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళంలో ఈ సినిమా డబ్బింగ్ జరుగుతుంది. చిరంజీవి పాత్రకు తమిళ నటుడు అరవిందస్వామి డబ్బిగ్ చెబుతున్నారని టాక్. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చరణ్‌తో ఉన్న అనుబంధంతో..
ఇంతకు ముందు చరణ్, అరవిందస్వామి కలిసి ధృవ సినిమాలో నటించారు. ఆ సినిమాలో చరణ్‌తో అరవిందస్వామికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ అనుబంధంతో చరణ్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి అరవిందస్వామి ఓకే చెప్పారట.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, నిహారిక, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెలలోనే ఆడియో వేడుకను కర్నూలులో నిర్వహిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఈ వేడుకకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా వచ్చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. భారీ అంచనాలతో సినిమా భారీ లెవల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout