తమిళ స్టార్ హీరో అజిత్‌కు కారు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రొఫెసర్ రేసర్ అని తెలిసిందే. ఎక్కువగా బైక్‌పై ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలాగే తన సినిమాల్లో కూడా యాక్షన్ సీక్వెన్స్ డూప్‌లు లేకుండానే చేస్తాడు. గతంలో 'వలిమై' చిత్రంలో బైక్ స్టంట్స్ అలాగే చేశాడు. తాజాగా ఓ చిత్రంలోనూ ఇలాగే కార్ స్టంట్స్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. గతేడాది నవంబర్‌లో అజర్‌బైజాన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం దర్శకుడు మాగిజ్ తిరుమనేని కాంబినేషన్‌లో 'విడా ముయార్చి' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరెక్కించారు. ఈ సమయంలో అజిత్ డూప్ లేకుండా తానే స్వయంగా కారు నడిపాడు. అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరవ్ కనిపిస్తున్నాడు. అతడి చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే వేగంగా కారు నడుపుతుండటంతో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఇదంతా కారులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే తనకు ఏం కాలేదని.. బాగానే ఉన్నట్లు అని అజిత్ వాయిస్ రికార్డు అయ్యింది.
తాజాగా అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. అజిత్‌కు ఏమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని కొంతమంది.. రియల్ హీరో అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష, రెజీనా కెసెండ్రా హీరోయిన్లుగా నటిస్తు్ండగా.. అర్జున్ సర్జా, అరుణ్ విజయ్, సంజయ్ దత్, ఆరవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com