శ్రీరెడ్డిపై త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ఫైర్‌...

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి.. ఇప్పుడు కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేయ‌డం స్టార్ట్ చేసింది. ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌, లారెన్స్‌, సుంద‌ర్‌.సి, న‌టుడు శ్రీకాంత్(తెలుగులో శ్రీరామ్‌) త‌దిత‌రులు త‌న‌ను అవ‌కాశాలిస్తాన‌ని వాడుకున్నార‌ని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై కోలీవుడ్‌లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది.

వారాహి అనే న‌టుడు త‌మిళ చెన్నై క‌మిష‌న‌రేట్‌కు కంప్లైంట్ ఇచ్చాడు. సుంద‌ర్‌.సి లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోబోతున్నారు. కార్తి అయితే ఆధారాల‌తో పోలీసుల‌ను సంప్ర‌దిస్తే ఇంకా న్యాయం జ‌రుగుతుంద‌ని కూడా అన్నారు. ఇలాంటి త‌రుణంలో భార‌తీరాజా శ్రీరెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు. శ్రీరెడ్డి స‌మ్మ‌తితోనే అన్ని జ‌రిగాయి.. అలాంటిది ఆమె వాటితో ప్ర‌చారాన్ని పొందాల‌నుకోవ‌డం స‌రికాదు.. సినిమాల్లో అంద‌రినీ త‌ప్పు ప‌ట్టడం స‌రికాదు.. అంటూ మాట్లాడారు.