Tamil Producers:కోలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం : ధనుష్, విశాల్ సహా నలుగురు హీరోలపై బ్యాన్.. కారణమిదే
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, విశాల్, అథర్వ, శింబులకు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షాకిచ్చింది. వీరు నలుగురికి రెడ్ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో శింబుకు రెడ్ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ వివాదంపై పెద్దలు కలగజేసుకుని చర్చలు జరిపినా.. శింబు నుంచి ఎలాంటి మార్పు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించే సమయంలో అసోసియేషన్ నిధులను విశాల్ దుర్వినియోగం చేసిన అభియోగంలో ఆయనకు రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు.
అటు ధనుష్ విషయానికి వస్తే.. తెనందాల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో నటించేందుకు ధనుష్ అంగీకరించారు. అయితే 80 శాతం షూట్ పూర్తయ్యాక చిత్రీకరణకు ధనుష్ నిరాకరించారని.. దీంతో నిర్మాతకు భారీ ఎత్తున నష్టాలు వచ్చాయని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. మదియలకన్ నిర్మాణ సంస్థతో యువ హీరో అథర్వ ఓ చిత్రానికి అంగీకరించారని.. కానీ షూటింగ్కు ఆయన ఏమాత్రం సహకరించడం లేదని కౌన్సిల్ వెల్లడించింది. మరోవైపు ఈ నలుగురు హీరోలతో పాటు ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలాపాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు కూడా రెడ్ కార్డ్ లిస్టులో వున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments