నా దగ్గర 8.55 కిలోల బంగారం ఉంది: ఖుష్బూ
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన వద్ద 8.55 కిలోల బంగారు నగలున్నాయని ఖుష్బూ... ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఈ నగల విలువ రూ.3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. తన ఖాతాలో రూ2.15 లక్షల నగదు ఉందని, సుమారు రూ.40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు ఉన్నాయన్నారు. తన పేరిట రూ.4.55 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఖుష్బూ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గురువారం చెన్నై థౌజెండ్‌లైట్స్ నియోజకవర్గంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
కాగా.. ఖుష్బూ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపిన ఖుష్బూ... కొన్ని గంటల తర్వాత... బీజేపీ ఆఫీసుకు వెళ్లి... ఆ పార్టీలో చేరిపోయారు. సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. ఈ పార్టీలో ఉంటూనే ఆ మధ్య కేంద్రం తెచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కుష్బూపై సీరియస్ అయ్యింది. అప్పటి నుంచే కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తరువాత కొద్ది రోజులకే ఖుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని దక్కించుకున్న అన్నాడీఎంకే మరోసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. డీఎంకే సైతం ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే కసితో ప్రతివ్యూహాలు పన్నుతోంది. దీంతో డీఎంకే, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోగా... అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పోటీ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంది. అయితే విజయావకాశాలు డీఎంకేకే మెండుగా ఉన్నాయని సమాచారం. ఒకవైపు అన్నాడీఎంకేపై వ్యతిరేకత ఉండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ రెండూ కలిసి బరిలోకి దిగాయి కాబట్టి డీఎంకేకి పరిస్థితులు ఫేవర్‌గా మారే అవకాశముందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com